మోక్షమెప్పుడో | - | Sakshi
Sakshi News home page

మోక్షమెప్పుడో

Jul 7 2025 6:48 AM | Updated on Jul 7 2025 6:48 AM

మోక్ష

మోక్షమెప్పుడో

డిగ్రీ ప్రవేశాలకు

త్వరలో స్పష్టత..

డిగ్రీ ప్రైవేశాలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం. నోటిఫికేషన్‌ వస్తుంది. నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం ప్రవేశాలు జరుగుతాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశాలు ఉంటాయి.

– డాక్టర్‌ కణితి శ్రీరాములు, ప్రిన్సిపాల్‌,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాతపట్నం,

శ్రీకాకుళం పురుషులు (ఎఫ్‌ఏసీ)

అడ్మిషన్లపై ప్రభావం..

డిగ్రీ ప్రైవేశాలపై ప్రభుత్వం అనేక కసరత్తులు చేసింది. కాస్త ఆలస్యమైనమాట వాస్తవమే. ఈ ప్రభావం అడ్మిషన్లపై పడవచ్చు. నోటిఫికేషన్‌ జాప్యం కావడంతో ప్రైవేటు కళాశాలలవైపు విద్యార్థులు ఆకర్షితులయ్యే అవకాశం లేకపోలేదు. నోటిఫికేషన్‌ రెండు రోజుల్లో రావొచ్చు.

– డాక్టర్‌ కింతలి సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్‌, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల

మూడు నెలలుగా నిరీక్షణ

ఇంటర్‌ ఎంపీసీలో 923 మార్కులు వచ్చాయి. ఇంజినీరింగ్‌పై ఆసక్తిలేదు. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఎంపీసీఎస్‌ చదవాలని అనుకుంటున్నాను. ఇంటర్‌ ఫలితాలు వచ్చి మూడు నెలల కావొస్తుంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్‌ రాకపోవడం దారుణం.

– ఎస్‌.పుష్పలత, విద్యార్థిని, శ్రీకాకుళం

ఇదీ పరిస్థితి..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలో 103 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 15 ప్రభుత్వ, 88 ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 28 వేల సీట్లు ఉన్నాయి. కొన్నేళ్ల కిందట జిల్లా నుంచి 20 వేల వరకు సీట్లు నిండేవి. గత ఏడాది ఈ సంఖ్య పది వేలకు పడిపోయింది. కొన్ని ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ కళాశాలల్లో సైతం గతంలో పోలిస్తే ఆర్ట్స్‌, కామర్స్‌ గ్రూపుల్లో ప్రవేశాలు తగ్గిపోయాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల కాంబినేషన్‌ కోర్సులను మూసివేశారు. ప్రధానంగా బీఎస్సీ ఎంపీసీ, కంప్యూటర్స్‌ కోర్సులకు డిమాండ్‌ ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం వంటి కళాశాలకు డిమాండ్‌ ఉంది. ప్రైవేట్‌ కళాశాలలు తీసుకుంటే శ్రీకాకుళం నగరం, రూరల్‌, రాజాం, నరసన్నపేట, టెక్కలి వంటి ప్రాంతాల్లో 20 కళాశాలల్లో సీట్లకు డిమాండ్‌ ఉంది. ఇంజినీరింగ్‌ కళాశాలలు అందుబాటులో ఉండటంతో ఇంటర్‌ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా అమలు చేయడంతో విద్యార్థులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిగ్రీలో ప్రవేశాల సంఖ్య తగ్గుతోంది.

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలై మూడు నెలలు గడిచాయి. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు సైతం విడుదలై నెల రోజులైంది. అయినా డిగ్రీ ప్రవేశాలకు మాత్రం మోక్షం కలగడం లేదు. కూటమి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలలో ఉన్నత విద్యాశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. గత ఏడాది ఇలాగే ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టడంతో ప్రభుత్వ కళాశాలల్లో వందలాది సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది అంతకుమించిన దుస్థితి తలెత్తుతుండటంతో కళాశాలల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు డిగ్రీలో చేరాలనుకుంటున్న విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. కొంతమంది ప్రైవేటు కోర్సుల బాట పడుతున్నారు.

ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా ?

ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలను గతంలో కళాశాల యూనిట్‌గా నిర్వహించేవారు. ఎంపిక చేసిన కళాశాలల్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకుని, సీటు లభించిన కళాశాలలో చేరే వారు. ఇంటర్మీడియెట్‌ మార్కులు, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పించేవారు. 2020 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం యూనిట్‌గా విద్యార్థులు వెబ్‌బేస్డ్‌ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకునేవారు. మార్కులు, రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా ప్రవేశాలు లభించేవి. ప్రైవేట్‌ కళాశాలలో 70 శాతం కన్వీనర్‌, 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటాలో ప్రవేశాలు నిర్వహిస్తారు. మేనేజ్‌మెంట్‌ సీట్లకు ప్రభుత్వ రాయితీలైన ఫీజు రీయింబర్స్‌మెంట్లు, స్కాలర్‌షిప్‌లు వంటివి వర్తించవు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ యాజమాన్యాలు పాతవిధానమైన ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించాలా? ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలా? అన్న అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ జాప్యం డిగ్రీ ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ నిర్వాకంతో రెండేళ్లగా డిగ్రీ ప్రవేశాలు తగ్గుముఖం పడుతున్నాయనేది గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ వద్ద ఫైల్‌ కొన్ని రోజుల తరబడి పెండింగ్‌లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ మిగిలిన శాఖలపై పెత్తనం చలాయిస్తుండటంతో.. తన విద్యాశాఖపై కనీసం దృష్టి పెట్టలేకపోతున్నారన్న విమర్శలకు డిగ్రీ ప్రెవేశాల ఉదంతమని విద్యార్థి సంఘాల ప్రతినిదులు ఆరోపిస్తున్నారు.

ఇంటర్‌ ఫలితాలు విడుదలై మూడు నెలలు

కనీసం దరఖాస్తులు చేసుకోవడానికి సైతం షెడ్యూల్‌ విడుదల చేయని వైనం

విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకుంటున్న కూటమి సర్కారు

మోక్షమెప్పుడో 1
1/4

మోక్షమెప్పుడో

మోక్షమెప్పుడో 2
2/4

మోక్షమెప్పుడో

మోక్షమెప్పుడో 3
3/4

మోక్షమెప్పుడో

మోక్షమెప్పుడో 4
4/4

మోక్షమెప్పుడో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement