ఇంటిని తీసుకుంటే బతికేదెలా? | - | Sakshi
Sakshi News home page

ఇంటిని తీసుకుంటే బతికేదెలా?

Jun 20 2025 5:24 AM | Updated on Jun 20 2025 5:24 AM

ఇంటిని తీసుకుంటే బతికేదెలా?

ఇంటిని తీసుకుంటే బతికేదెలా?

సారవకోట:

కుమార్తెలు ఆదరించడం లేదంటూ సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు శిమ్మ చిన్నమ్మి వాపోయింది. తనకు ముగ్గురు కుమార్తెలున్నా ఎవరూ ఆదరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త నుంచి సంక్రమించిన ఇంటిని సైతం చిన్న కుమార్తె ఆధీనంలో తీసుకుని ఇంటి నుంచి పంపించేందుకు చూస్తోందని ఆరోపించింది. దీనిపై తహశీల్దార్‌, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌ గ్రీవెన్స్‌లలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న కుమార్తె తన ఇంటిని తనఖా పెట్టి రూ.3 లక్షలు అప్పు తీసుకుని చెల్లంచనందున, అప్పు ఇచ్చిన వారు ఆ ఇంటిని తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఆ ఇంటిని తీసుకుంటే తనకు నిలువు నీడ కూడా ఉండదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement