అక్రమాలకు ‘అడ్డు’ లేకుండా! | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు ‘అడ్డు’ లేకుండా!

Jun 18 2025 3:05 AM | Updated on Jun 18 2025 3:05 AM

అక్రమ

అక్రమాలకు ‘అడ్డు’ లేకుండా!

అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి చెందిన వాడాడ కూడలి వద్ద ఉన్న భూముల్లో అక్రమంగా నిర్మించిన రహదారిపై ‘సాక్షి’ పలుమార్లు ప్రచురించిన కథనాలకు దేవదాయ శాఖాధికారులు స్పందించి గత నెల 26న ఐరన్‌ మెస్‌ బారికేడ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని అంతా భావించారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ మంగళవారం ఉదయానికి బారికేడ్లు మాయమయ్యాయి. పక్కనున్న పొలాల్లో మెస్‌లను తోసేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి అడ్డంగా కట్టుదిట్టంగా బారికేడ్లు వేయడం గానీ, ఏకంగా అక్రమ రహదారిని జేసీబీతో తొలగించడం గానీ చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.

అక్రమాలకు ‘అడ్డు’ లేకుండా! 1
1/1

అక్రమాలకు ‘అడ్డు’ లేకుండా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement