
నాన్న త్యాగశీలి
మా అన్నదమ్ముల ఉన్నత భవిష్యత్ కోసం మా తండ్రి చంద్రరావు ఎన్నో త్యాగాలు చేశారు. మా కోసం ఆయన జీవితాన్ని ధారబోశారు. మా తల్లిదండ్రులు రోహి ణి, చంద్రరావు పెద్దగా చదువుకోలేదు. మాది వ్యవసాయ కుటుంబం. అయినా మా తమ్ముడు బా న్న వంశీ, నేను ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్న ప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివించారు. మేం ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నప్పుడు మాకంటూ ఓ గుర్తింపు రావాలని నాన్న ఎంతో తపించేవారు. మా తమ్ముడు వంశీకి లాంగ్‌టెర్మ్ కోచింగ్ ఇప్పించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజి త్రివేండ్రంలో ఇంజినీరింగ్ చదివించారు. అతను శ్రీహరి కోటలో శాస్త్రవేత్తగా స్థిరపడ్డాడు. నేను ఐపీఎస్ శిక్షణ తీసుకుంటూ మరోవైపు ఐఏఎస్ సాధించాను.
– బాన్న వెంకటేష్, సివిల్స్ విజేత

నాన్న త్యాగశీలి