సుసంపెన్‌మైన ఆలోచన | - | Sakshi
Sakshi News home page

సుసంపెన్‌మైన ఆలోచన

Jun 14 2025 10:18 AM | Updated on Jun 14 2025 10:18 AM

సుసంప

సుసంపెన్‌మైన ఆలోచన

కాశీబుగ్గ: భూమి వేడెక్కిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ ఎవరూ ప్లాస్టిక్‌ నిషేధం, పునర్వినియోగంపై దృష్టి సారించడం లేదు. ఈ విషయంలో కాశీబుగ్గ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఓ అడుగు ముందుకు వేసింది. వాడి పడేసిన పెన్నులను సేకరించి వాటిని రీసైక్లింగ్‌కు ఇచ్చేలా ఓ వ్యవస్థను రూపొందించింది. పెన్నులతో సుసంపన్నమైన ఆలోచన చేసింది.

కాశీబుగ్గ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు సుమా రు 1038 మంది చదువుతున్నారు. పాఠశాలలో ఇంకు అయిపోయి పనికిరాని పెన్ను లను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఇవి పిల్లల కాళ్లకు గుచ్చుకుంటూ ఇబ్బంది పెట్టేవి. ఇప్పుడు మాత్రం అలా కాకుండా పాఠశాలలో ఓ పచ్చని చెట్టుకు ‘యూజ్‌ మి’ అని ఓ బాక్సును ఏర్పాటు చేశారు. దానిపై ప్లాస్టిక్‌ పెన్నులు వాడిన అనంతరం ఇందులో వేయాలని రాశారు. అక్కడితో ఆగకుండా ప్రధానోపాధ్యాయులు పాఠశాల సర్క్యులర్‌లో పొందుపరిచి దానికి ప్రతి తరగతి గదికి అమలు చేసే బాధ్యత క్లాస్‌ లీడర్‌లకు అప్పగించారు. ఇంకేముంది పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులు ఉండడంతో రోజుకు పదుల సంఖ్యలో పెన్నులు బాక్సులోకి చేరుతున్నాయి. నిండిన బా క్సును మరి కొంతమంది కమిటీ సభ్యులు సేకరించి బస్తాల్లో వేస్తున్నారు. అలా ప్లాస్టిక్‌ పెన్నులు బస్తాలుగా మారుతున్నాయి. వాటితో ప్రాజెక్టులు చేయ డానికి, రీసైక్లింగ్‌కు ఉపయోగించాలని ప్రత్యక్షంగా నేర్పిస్తున్నారు. దీంతో పాటు ప్లాస్టిక్‌ దుకాణాలకు అమ్మి వాటితో మొక్కలు కొనుగోలు చేయడం వంటి పనులు కూడా చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులకు సైతం అలవాటైంది. ఈ పాఠశాలలో జరుగుతున్న ఈ విధానం అన్ని పాఠశాలలకు తెలిస్తే ఇంకా సంతోషిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.

వ్యర్థానికి అర్థం

నేను హెచ్‌ఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎక్కడ చూసినా వాడిన పెన్నులు కనిపించాయి. వాటిని నేను సేకరించి బయట పారవేసేవాడిని. రోజు గడిచాక మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చేది. అప్పుడే ఉపాధ్యాయుల సహకారంతో వాడిన పెన్నులు రీసైక్లింగ్‌కు ఇవ్వాలనే ఆలోచనతో ఇలా బాక్సును పెట్టాం. పనికిరాని వస్తువంటూ ఏమీ ఉండదని, అన్ని ఉపయోగపడతాయని పిల్లలకు చెబుతున్నాం. అన్ని పాఠశాలలు మాలా చేస్తూ ఇంకా సంతోషిస్తాం.

– చిన్నంనాయుడు, ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాల, కాశీబుగ్గ

వాడిపడేసిన పెన్నుల సేకరణ

వాటిని రీసైక్లింగ్‌ చేసేలా విద్యార్థులకు తర్ఫీదు

కాశీబుగ్గ హైస్కూల్‌ వినూత్న ప్రయోగం

సుసంపెన్‌మైన ఆలోచన 1
1/2

సుసంపెన్‌మైన ఆలోచన

సుసంపెన్‌మైన ఆలోచన 2
2/2

సుసంపెన్‌మైన ఆలోచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement