3806 | - | Sakshi
Sakshi News home page

3806

May 3 2025 8:29 AM | Updated on May 3 2025 8:29 AM

3806

3806

● 23 ఐటీఐలు..
సీట్లు

ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

24 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఎచ్చెర్ల క్యాంపస్‌ : పదో తరగతి పూర్తి చేసిన పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే కోర్సుల్లో ఐటీఐ(ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌) ఒకటి. ఇందులో చేరిన విద్యార్థులకు అప్రెంటీస్‌ తర్వాత 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించే అవకాశాలు అధికంగా ఉంటాయి. నైపుణ్యాలు ఆధారంగా విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది. మరోవైపు పాలిటెక్నిక్‌ డిప్లమాలో నేరుగా రెండో ఏడాది లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు లభిస్తాయి. అందుకే ఐటీఐలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. జిల్లాలో మూడు ప్రభుత్వ ఐటీఐలు(శ్రీకాకుళం డీఎల్‌టీసీ, ఎచ్చెర్ల, పలాస)లలో 760 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 20 ప్రైవేట్‌ ఐటీఐలలో 3056 సీట్లు కలిపి మొత్తం 23 ఐటీఐలలో 3806 సీట్లలో ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైంది.

కోర్సులివే..

ప్రభుత్వ ప్రైవేట్‌ ఐటీఐల్లో రెండేళ్లు, సంవత్సరం వ్యవధి గల ట్రేడులు ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తి మేరకు ట్రేడ్లు ఎంచుకోవచ్చు. ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, డ్రాఫ్టస్‌మ్యాన్‌ సివిల్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌ రెండేళ్ల ట్రేడులు కాగా, వెల్డర్‌, కోపా, డీజిల్‌ మెకానిక్‌, హార్టికల్చర్‌ ఏడాది చదవాల్సి ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా సూయింగ్‌ టెక్నాలజీ ట్రేడ్లు సైతం అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ..

ఐటీఐ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ‘ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ప్రభుత్వ ఐటీఐల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. జూన్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తారు. కౌన్సెలింగ్‌ సమాచారాన్ని విద్యార్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపిస్తారు. 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్‌ రోస్టర్‌, ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అర్హులకు నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది.

సద్వినియోగం చేసుకోవాలి

10వ తరగతి తర్వాత ఉపాధికి అవకాశం ఉన్న కోర్సు ఐఐటీ. ఈ కోర్సుల్లో ఎటువంటి ఒత్తిడి ఉండదు. ప్రయోగాలకు, నైపుణ్యాలకు ప్రాధాన్యముంటుంది. అప్రెంటీస్‌, నైపుణ్యం ఆధారంగా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ ఐటీఐలకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలి. – ఎల్‌.సుధాకరరావు, ప్రవేశాల కన్వీనర్‌, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌

38061
1/2

3806

38062
2/2

3806

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement