ఆటాడుకుందాం రా..! | - | Sakshi
Sakshi News home page

ఆటాడుకుందాం రా..!

May 1 2025 1:23 AM | Updated on May 1 2025 1:23 AM

ఆటాడు

ఆటాడుకుందాం రా..!

అథ్లెటిక్స్‌: జీహెచ్‌ స్కూల్‌ పలాస– 9494379648, టెక్కలి– 9492417570, జెడ్పీహెచ్‌ స్కూల్‌ కేకే రాజపురం– 8464906752, టీపీఎంహెచ్‌ స్కూల్‌ శ్రీకాకుళం– 8500271575, కేవీకే ఇచ్ఛాపురం– 9441024555, పాతపట్నం– 9100736583, జెడ్పీహెచ్‌ స్కూల్‌– 8688872304.

వాలీబాల్‌: జెడ్పీహెచ్‌ స్కూల్‌ కేశవరావుపేట– 9441011391, జెడ్పీహెచ్‌ స్కూల్‌ పైడి భీమవరం– 9849326018, జెడ్పీహెచ్‌ స్కూల్‌ ప్రగడపుట్టుగ– 9491569394, జెడ్పీహెచ్‌ స్కూల్‌ కొర్ని– 9440955034, జెడ్పీహెచ్‌ స్కూల్‌ మాకివలస– 9963753719, జెడ్పీహెచ్‌ స్కూల్‌ పాతపట్నం– 9440955034, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ– 9494814087.

కబడ్డీ: బలగ శ్రీకాకుళం – 9010406706, జెడ్పీహెచ్‌ స్కూల్‌ సింగుపురం– 9642287746, ప్రభుత్వ డిగ్రీ కళాశాల టెక్కలి– 9441262515, జెడ్పీహెచ్‌ స్కూల్‌ పల్లెసారధి– 9502983175.

ఖోఖో: జెడ్పీహెచ్‌ స్కూల్‌ పలాస– 9618583449, కేఆర్‌ స్టేడియం శ్రీకాకుళం– 9866288802, ఎంజీహెచ్‌ స్కూల్‌ ఇచ్ఛాపురం– 9177914135.

హ్యాండ్‌బాల్‌: జెడ్పీహెచ్‌ స్కూల్‌ అల్లినగరం– 9493764447, జెడ్పీహెచ్‌ స్కూల్‌ పిల్లలవలస– 9966849462, జెడ్పీహెచ్‌ స్కూల్‌ పాతటెక్కలి– 7330831517.

సాఫ్ట్‌బాల్‌: జెడ్పీహెచ్‌ స్కూల్‌ ఇప్పిలి– 9440436317, జెడ్పీహెచ్‌ స్కూల్‌ కేశవరావుపేట– 9705302968, జెడ్పీహెచ్‌ స్కూల్‌ కురుడు– 9052500720.

ఫుట్‌బాల్‌: కేఆర్‌ స్టేడియం శ్రీకాకుళం– 9533691018, కలెక్టరేట్‌ వద్ద ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ హెచ్‌–గ్రౌండ్‌ శ్రీకాకుళం– 9177564623, జెడ్పీహెచ్‌ స్కూల్‌ నరసన్నపేట– 8639629920.

బాల్‌ బ్యాడ్మింటన్‌: జీహెచ్‌ స్కూల్‌ ఎచ్చెర్ల– 8074452351, ఎంజేపీ నరసన్నపేట– 7013473337.

బాక్సింగ్‌: ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్‌,శ్రీకాకుళం– 8977496979, పీఎస్‌ఎన్‌ఎంహెచ్‌ స్కూల్‌ శ్రీకాకుళం– 9989364548.

జూడో: జెడ్పీహెచ్‌ స్కూల్‌, వప్పంగి– 9440688828, జెడ్పీహెచ్‌ స్కూల్‌ పోలవరం– 9550743035.

తైక్వాండో: ఆర్ట్స్‌ కాలేజ్‌ ప్రాంగణం శ్రీకాకుళం– 9393178455, టౌన్‌ హాల్‌ శ్రీకాకుళం– 8919591487.

వెయిట్‌ లిఫ్టింగ్‌: జీహెచ్‌ స్కూల్‌ నరసన్నపేట: 9492299769, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆమదాలవలస– 9390745150.

బ్యాడ్మింటన్‌: టెక్కలి– 7799335725

బేస్‌బాల్‌: జెడ్పీహెచ్‌ స్కూల్‌ లావేరు– 8639000705.

బాస్కెట్‌బాల్‌: టెక్కలి– 8986951096.

చెస్‌: కోడిరామ్మూర్తి (కేఆర్‌) స్టేడియం శ్రీకాకుళం– 9908162634.

క్రికెట్‌: పాతపట్నం– 9701454500.

ఫెన్సింగ్‌: టౌన్‌హాల్‌ శ్రీకాకుళం– 7660874844.

సెపక్‌తక్రా: ఎన్టీఆర్‌ఎం హెచ్‌స్కూల్‌ శ్రీకాకుళం– 8500828965.

టేబుల్‌టెన్నిస్‌: బాలభాను విద్యాలయం – 9290577033.

టెన్నీకాయిట్‌: జీహెచ్‌స్కూల్‌ పలాస– 9441089592.

ఉషూ: ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణం శ్రీకాకుళం– 9885734313.

● నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభం

● జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో నెలరోజుల పాటు శిక్షణ

● 22 క్రీడాంశాలకు చోటు

● 8 ఏళ్లు పైబడిన బాలబాలికలకు అవకాశం

శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో బాలబాలికలంతా మైదానబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులంతా మరో నెల రోజులపాటు ఆటల్లో ముగినితేలనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు(సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌)లను నిర్వహిస్తున్న విషయం విదితమే. జిల్లాలో గురువారం నుంచి శిక్షణా శిబిరాలు మొదలుకానున్నాయి.

అరకొర నిధులతోనే..

మే ఒకటి నుంచి మొదలుకానున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు విధిల్చి చేతులు దులుపేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలలో మే నెలాఖరు వరకు ఈ శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. ఒక్కొక్క శిబిరానికి కేవలం రూ.7వేలు మాత్రమే కేటాయించారు. ఇందులో శిక్షకుడు/కోచ్‌కు రూ.1500, ఫ్లెక్సీకి రూ. 500, స్పోర్ట్స్‌ మెటీరియల్‌కు రూ.5వేలు వెచ్చించనున్నారు. శిక్షణ సమయంలో క్రీడాకారులకు పోటీ లను నిర్వహిస్తారు. ఆఖర్లో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అందజేస్తారు. అరకొరగా నిధుల కేటాయింపు పట్ల క్రీడాసంఘాల ప్రతినిధులు పెదవివిరిస్తున్నారు.

ఇవీ విధివిధానాలు..

● సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులలో 8 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందిస్తారు. 16 ఏళ్లపైబడి ఆసక్తి కలినవారు కూడా హాజరుకావచ్చు.

● ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మరళా సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది.

● శాప్‌ కోచ్‌లతోపాటు పీడీలు/పీఈటీలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ అందించేందుకు అర్హులు.

● ప్రతిరోజు క్రీడాకారులకు హాజరు వేయాల్సి ఉంటుంది.

● వారంతాల్లో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి.

● శిబిరాల సమయంలో గ్రామీణ, పాఠశాల స్థాయి స్పోర్ట్స్‌ క్లబ్‌లను క్రీడాంశాల వారీగా ఏర్పాటు చేయాలి.

● శిక్షణా శిబిరాల సమయంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారిని ప్రత్యేకంగా సానబెట్టి భవిష్యత్తులో జరిగే పోటీలకు సిద్ధంచేయాలి.

● దాతల సహకారం, చేయూతతో శిక్షణా శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలకు క్రీడాపరికరాలు, క్రీడాదుస్తులు, షూ, సాక్సులు, స్నాక్స్‌, మెడల్స్‌, బహుమతులు, అందించేలా ఆయా కేంద్రాల శిక్షకులు చొరవ తీసుకోవాలి.

గ్రామీణ క్రీడలకు పెద్దపీట..

సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ కేటాయింపులో గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారు. జిల్లా వ్యాప్తంగా 22 కేంద్రాలను కేటాయించారు. అత్యధికంగా అథ్లెటిక్స్‌కు, వాలీబాల్‌కు ఏడేసి చొప్పున కేంద్రాలను కేటాయించగా.. కబడ్డీ 4, ఫుట్‌బాల్‌ 3, హ్యాండ్‌బాల్‌ 3, సాఫ్ట్‌బాల్‌ 3, ఖోఖో 3, బాల్‌ బ్యాడ్మింటన్‌ 2, బాక్సింగ్‌ 2, జూడో 2, తైక్వాండో 2, వెయిట్‌లిఫ్టింగ్‌ 2, బ్యాడ్మింటన్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, చెస్‌, క్రికెట్‌, ఫెన్సింగ్‌, సెపక్‌తక్రా, టేబుల్‌టెన్నిస్‌, టెన్నికాయిట్‌, ఉషూ క్రీడాంశాల్లో చెరో కేంద్రం చొప్పున శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. అత్యంత ఆదరణ కలిగిన ఆయా ప్రాంతాల్లో పాఠశాలల మైదానాల్లోనే శిక్షణ అందించనున్నారు.

శిబిరాలు ఎక్కడెక్కడంటే..

సద్వినియోగం చేసుకోవాలి..

బాలబాలికల ప్రతిభ బయటపడేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలలోనే. జాతీయస్థాయిలో తీర్చిదిద్దే శిక్షకులు జిల్లాలో ఉన్నారు. క్రమం తప్పుకుండా హాజరై శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ఒలింపిక్‌ అసోసియేషన్‌, క్రీడాసంఘాలు, పీఈటీ సంఘ నాయకులతో కలిసి శిక్షణా కేంద్రాలను కేటాయించాం. కేంద్రానికి రూ.7వేలు చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించిన విదివిధానాలను శాప్‌ ప్రకటించింది.

– డాక్టర్‌ కె.శ్రీధర్‌రావు,

డీఎస్‌డీఓ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, శ్రీకాకుళం

ఆటాడుకుందాం రా..! 1
1/2

ఆటాడుకుందాం రా..!

ఆటాడుకుందాం రా..! 2
2/2

ఆటాడుకుందాం రా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement