నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

ప్రశాంతి నిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్‌ఎస్‌ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు రాకుండా www. meekosam. ap. gov. in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌, మునిసిపల్‌, మండల కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని , ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పోలీస్‌ కార్యాలయంలో ..

పుట్టపర్తి టౌన్‌: పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్‌ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ వెంట కచ్చితంగా ఆధార్‌కార్డు తీసుకురావాలన్నారు.

వడదెబ్బతో వ్యక్తి మృతి

కదిరి అర్బన్‌: మండల పరిధిలోని మత్తన్నగారిపల్లికి చెందిన గంగులయ్య (45) ఆదివారం వడదెబ్బతో చనిపోయాడు. శనివారం రాత్రి గాండ్లపెంట మండలంలోని మలమీదపల్లిలో జాతరకు వెళ్లాడు. ఉదయం ఇంటికి రాగానే అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తన భర్త ఎండకు ప్రయాణం చేయడంతో వేడికి తట్టుకోలేక మృతి చెంది ఉంటాడని మృతుని భార్య సుగుణమ్మ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు.

హిందూపురంలో...

హిందూపురం: పట్టణంలోని 4వ వారు్‌ోడ్లని త్యాగరానగర్‌లో నివాసం ఉంటున్న ప్రేమ్‌కుమార్‌ (27) తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. ఆదివారం ఉదయం త్యాగరాజునగర్‌లోని ఆటోస్టాండ్‌ వద్ద నడుచుకుంటూ వెళుతుండగా ప్రేమ్‌కుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు కుమార్‌ను వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు.

ఖైదీ నుంచి కానిస్టేబుల్‌

డబ్బు వసూలు

రూ.65 వేలు ఫోన్‌ పే ద్వారా వసూలు

అనంతపురం సెంట్రల్‌: పోలీసుశాఖలోని ఏఆర్‌ విభాగం కానిస్టేబుల్‌ అవినీతి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. రిమాండ్‌ ఖైదీలను కోర్టు వాయిదా బందోబస్తు నిమిత్తం వెళ్లిన సదరు కానిస్టేబుల్‌ ఏకంగా నిందితుడితోనే డీల్‌ కుదుర్చుకున్నాడు. ఓ దొంగతనం కేసులో సదరు నిందితుడు పట్టుబడినట్లు సమాచారం. రెడ్డిపల్లి సబ్‌జైలు నుంచి పలుమార్లు రాయదుర్గం కోర్టుకు సదరు నిందితుడిని వాయిదాలకు తీసుకుపోయేవారు. ఎస్కార్ట్‌ వాహనంలో నిందితులకు బందోబస్తుగా సదరు కానిస్టేబుల్‌ వెళ్లేవాడు. ఇలా పలుమార్లు సదరు నిందితుడితో చర్చలు జరిపాడు. ఈ కేసులో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాను..బెయిల్‌ రావడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని సదరు కానిస్టేబుల్‌ నమ్మబలికాడు. నిందితుడి బంధువుల నుంచి రూ.65 వేలు ఒకేసారి ఫోన్‌ఫే ద్వారా తన బ్యాంకు ఖాతాకు వేయించుకున్నాడు. బెయిల్‌ రావడానికి కావాల్సిన ష్యూరిటీలు ఇప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. డబ్బులు తీసుకున్న తర్వాత కానిస్టేబుల్‌ చేతులెత్తేశాడు. దీంతో నిందితుడు, వారి బంధువులు డబ్బులు తీసుకొని పనిచేయలేదు.. డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్‌ చేయగా ఘటన బయటకు పొక్కింది.

గుట్టుగా విచారణ : ఏఆర్‌ కానిస్టేబుల్‌ అవినీతి ఉదంతంపై గుట్టగా పోలీసులు విచారిస్తున్నారు. డబ్బు తీసుకున్న మాట వాస్తమని విచారణలో కానిస్టేబుల్‌ అంగీకరించినట్లు సమాచారం. రిమాండ్‌ ఖైదీకి.. కానిస్టేబుల్‌కు మధ్య ఓ లాయర్‌ రాయభారం నడిపినట్లు చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై రెండు, మూడు రోజుల్లో సదరు కానిస్టేబుల్‌పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement