ప్రశాంతినిలయం: నిషేధిత భూముల క్లెయిములను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 22–ఏ జాబితా మార్పులకు మొత్తం 453 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. వీటిలో 59 దరఖాస్తులను ఇంకా పరిశీలించాల్సి ఉండగా 32 దరఖాస్తులు ప్రాసెస్‌లో, 29 దరఖాస్తులు ఎస్‌ఎల్‌ఏ లోపల, 415 బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దాటి పెండింగ్‌లో ఉన్నాయన్నారు.308 తహసీల్దార్ స్థాయిలో, 15 ఆర్డీఓ స్థాయిలో, 12 జేసీ స్థాయిలో పెండింగ్ ఉన్నాయని చెప్పారు. డివిజన్ల వారీగా చూస్తే ధర్మవరంలో 136, పుట్టపర్తి– 94, కదిరి–81, పెనుకొండ–112, మడకశిరలో 29 ఉన్నాయన్నారు. చుక్కల భూముల క్లెయిములకు సంబంధించి జిల్లాలో మొత్తం 281 అభ్యర్థనల్లో 64 అభ్యర్థనలు ఎస్‌ఎల్‌ఏ లోపల ఉండగా 216 ఎస్‌ఎల్‌ఏ దాటి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ పుట్టపర్తి మండలంలో ఒక అభ్యర్థనను ఆమోదించినట్లు చెప్పారు. ధర్మవరం డివిజన్‌లో 113, కదిరి డివిజన్– 77, పుట్టపర్తి– 49, పెనుకొండ–9, మడకశిరలో 3 ఉన్నాయని, దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు మండల స్థాయిలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాం ప్రసాద్
‘మన పల్లె–మన నీరు’
వేగవంతం చేయండి
ప్రశాంతినిలయం: మన పల్లె–మన నీరు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించారు. జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం చెరువులు, సప్లై చానళ్లలో కంప చెట్ల తొలగింపు, పూడికతీత పనులు చేపట్టాలన్నారు. వర్షాకాలం కంటే ముందే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ విశ్వనాథరెడ్డి, ఏఈలు గురుమూర్తి, సురేందర్‌రెడ్డి, డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్, గ్రౌండ్ వాటర్ ఏడీ రాజశేఖర్‌రెడ్డి, డీఈఈలు గంగాధర్, గంగాద్రి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


