నవ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

నవ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం

Mar 8 2026 7:20 AM | Updated on Mar 8 2026 7:20 AM

పుట్టపర్తి టౌన్‌: నవ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని ఎస్పీ సతీష్‌కుమార్‌ తెలిపారు. శనివారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్‌, ఆయన సతీమణి ధరణ్య, అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్‌ కట్‌ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు జిల్లా కేంద్రంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించామన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో సాగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నేటి సమాజంలో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా మాట్లాడుతూ సమాజంలో మహిళలకు తగిన గౌరవం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మహిళా సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement