మ్యాన్‌పవర్‌ కొరత | - | Sakshi
Sakshi News home page

మ్యాన్‌పవర్‌ కొరత

Oct 31 2025 9:25 AM | Updated on Oct 31 2025 9:25 AM

మ్యాన

మ్యాన్‌పవర్‌ కొరత

జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్‌లలోనూ విద్యుత్‌ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఫలితంగా సిబ్బందిలో అసహనం రేకెత్తి వినియోగదారులపై చిందులు తొక్కడం పరిపాటిగా మారింది.

కదిరి: జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌ శాఖలో పర్యవేక్షక అధికారులు, క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగుల ఖాలీలతో విద్యుత్‌ సేవలకు తరచూ అంతరాయం కలుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో విద్యుత్‌శాఖలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఏటా గృహ, వ్యవసాయ కనెక్షన్లు పెరుగుతున్నా.. దానికి తగినట్లుగా సిబ్బంది లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

● విద్యుత్‌ నిబంధనల ప్రకారం 5 వేల కనెక్షన్ల వరకూ ఒక ఏఈ పర్యవేక్షించాల్సి ఉండగా జిల్లాలో ప్రస్తుతం ఒక్కో ఏఈ 10 నుంచి 12 వేల కనెక్షన్లు పర్యవేక్షిస్తున్నారు.

● ఒక్కో సెక్షన్‌కు ఒక ఏఈ ఉండాలి. కానీ తనకు కేటాయించిన దాంతో పాటు మరో నాలుగు అదనపు సెక్షన్ల భారం కూడా మోస్తున్నారు.

● ఒక్కో సబ్‌ స్టేషన్‌లో ముగ్గురు లైన్‌మెన్‌లు ఉండాల్సి ఉండగా కొన్ని చోట్ల ఒక్కరే ఉన్నారు. ఇంకొన్ని చోట్ల అసలే లేరు.

● ఒక్కో లైనన్‌మెన్‌ వెయ్యి సర్వీసులను చూసుకోవాల్సి ఉండగా 5 వేల కనెక్షన్ల వరకు చూడాల్సి వస్తోంది.

● ఒక పంచాయతీకి ఒక లైన్‌మ్యాన్‌ ఉండాలి. జిల్లాలో చాలా చోట్ల నాలుగైదు పంచాయతీలకు ఒకే లైన్‌మ్యాన్‌ ఉంటున్నారు.

● సిటిజన్‌ చార్ట్‌ ప్రకారం ఏదైనా కారణం చేత విద్యుత్‌కు అంతరాయం కలిగితే ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోపు పునరుద్దరించాలి. అలాగే ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే పట్టణాల్లో అయితే 12 గంటలు, గ్రామాల్లో 24 గంటల్లోపు సమస్య పరిష్కరించాలి. అయితే ఎక్కడేగానీ ఈ నిబంధన అమలు కావడం లేదు.

జిల్లాలో విద్యుత్‌ శాఖలో

పలు పోస్టుల ఖాళీ

ఏటా పెరుగుతున్న విద్యుత్‌ కనెక్షన్లు

వినియోగదారులకు అందని

నాణ్యమైన సేవలు

ఉన్న సిబ్బందిపై ఓవర్‌ లోడ్‌

ఖాళీలను భర్తీ చేయని

కూటమి సర్కారు

సిబ్బంది కొరత వాస్తవమే

జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌శాఖలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. ఈ కారణంగా క్షేత్రస్థాయిలో రైతులు, వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను సీఎండీ దృష్టికి తీసుకెళ్లాం. పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదించాం.

– కొమ్ము సంపత్‌కుమార్‌,

ఎస్‌ఈ, విద్యుత్‌ శాఖ

జిల్లాలో విద్యుత్‌ కనెక్షన్లు ఇలా..

గృహ అవసరాలు: 5,08,291

వాణిజ్య అవసరాలు: 50,817

పారిశ్రామిక అవసరాలు: 8,556

పంచాయతీ, మున్సిపల్‌: 13,743

అగ్రికల్చర్‌ : 1,32,950

నిబంధనలు ఇలా:

మ్యాన్‌పవర్‌ కొరత1
1/1

మ్యాన్‌పవర్‌ కొరత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement