
జిల్లా ప్రజల అభిమానం మరువలేనిది: కలెక్టర్ చేతన్
ప్రశాంతి నిలయం: ‘‘జిల్లా ప్రజల ప్రేమ, అభిమానం మరువలేనిది. జిల్లా అభివృద్ధికి తోడ్పాటునందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు. పూర్తి సంతృప్తితో ఇక్కడి నుంచి వెళ్తున్నా’’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. ప్రభుత్వం టీఎస్ చేతన్‌ను గురువారం బదిలీ చేయగా... శుక్రవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఆయనకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు జాతీయ రహదారులు, సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కలెక్టర్ టీఎస్ చేతన్‌కు వీడ్కోలు పలుకుతూ సత్యసాయి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీఓలు సువర్ణ, వీవీఎస్ శర్మ, ఆనంద్‌కుమార్, మహేష్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మైనుద్దీన్, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
37 మందికి ఏఎస్‌ఐలుగా పదోన్నతి
పుట్టపర్తి టౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 37 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఏఎస్‌ఐ)గా పదోన్నతి లభించింది. ఈ మేరకు అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1996 పోలీస్ సర్వీస్ రూల్స్ ప్రకారం రోస్టర్ పాయింట్ల ఆధారంగా పదోన్నతులు కల్పించారు. హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన వారిలో టి.చంద్రశేఖర్, కె. లక్ష్మీనారాయణ, సి.బాబు, ఏ.శ్రీనివాసులు, జి.నరహరి, ఎస్. శ్రీరామనాయక్, ఎస్. బీమ్లా నాయక్, జి.సౌరెడ్డి, బి.నారాయణ, కె.లక్ష్మీనారాయణ, వి.నాగరాజు, సి.రవికాంత్, ఆర్, సంజీవులు, ఎం.అశోక్‌కుమార్, టీఎస్ హనీష్‌బాబు, డీఎన్ .చలంబాబు, వై.కృష్ణమూర్తి, వై. వెంకటరాముడు, బి.ఎర్రిస్వామి, జె.అమరేశ్వర్‌రావు, ఏ. ఆదినారాయణ, కె. ధనుంజయ, ఏసీ సురేంద్రబాబు, టీ. వెంకటేషులు, కె. జయరాముడు, జి. ఈశ్వరయ్య, కె. షబ్బీర్‌ఖాన్, జి. తిప్పయ్య, ఎం. వెంకటేసులు, బి. వెంకటనారాయణ, జీసీ అఽశ్వర్థనారాయణ, బి. శ్రీనివాసులు, కె. దేవానంద, బి. నరేంద్రనాథ్‌రెడ్డి, ఎం. రామకృష్ణ, డి. భాస్కర్‌బాబు, సి. శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు.
నేటి నుంచి వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు రాగల ఐదు రోజులు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షం పడే సూచన ఉందని పేర్కొన్నారు. ఈ నెల 13న 13 మి.మీ, 14న 8 మి.మీ, 15న 14 మి.మీ, 16న 16 మి.మీ, 17న 15 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు.

జిల్లా ప్రజల అభిమానం మరువలేనిది: కలెక్టర్ చేతన్