బాలల హక్కులను పరిరక్షిద్దాం | Sakshi
Sakshi News home page

బాలల హక్కులను పరిరక్షిద్దాం

Published Wed, Nov 15 2023 12:12 AM

ప్రసంగిస్తున్న ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి - Sakshi

పోస్టర్ల విడుదల

బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేస్తుంటే వెంటనే 1098 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం విద్యార్థులను కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ వారిని వేదికపై కూర్చోబెట్టి సత్కరించారు. విద్యార్థులందరికీ ‘చైల్డ్‌ లైన్‌ సేదోస్తీ వీక్‌’ పేరుతో చేతికి బ్యాండ్‌లు కట్టారు. అనంతరం ఈ ఏడాది చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పుట్టపర్తి సీఐ కొండారెడ్డి, ‘సెబ్‌’ సీఐ మాధవి, సీడీపీఓ గాయత్రి, ఎస్‌ఐ రెడ్డప్ప, ఎన్‌జీఓ కోఆర్డినేటర్‌ ఎల్లప్ప, హెచ్‌ఎం ప్రభావతి, చైల్డ్‌లైన్‌ సిబ్బంది నిర్మల, హాసిని ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పుట్టపర్తి అర్బన్‌: బాలల హక్కుల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి, జిల్లా బాలల పరిరక్షణ సమితి అధికారిణి వెంకటేశ్వరి కోరారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా బాలల పరిరక్షణ సమితి, చైల్డ్‌డ్‌లైన్‌, ఐసీడీఎస్‌ శాఖల ఆధ్వర్యంలో చిన్నపల్లి ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఐసీడీఎస్‌ పీడీ మాట్లాడుతూ...బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ముఖ్యంగా బ్రూణహత్యలను నివారించి బాలలకు జీవించే హక్కు కల్పించాలన్నారు. అలాగే నిర్బంధ విద్యను అందించాలని, బాల్య వివాహాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బాలల హక్కులను కాపాడాలంటే ప్రజలందరి సహకారం అవసరమన్నారు. బాలల రక్షణ కోసం రూపొందించిన చట్టాలు, అతిక్రమిస్తే విధించే శిక్షల వివరాలను ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు.

బాలల దినోత్సవంలో ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి

Advertisement
 
Advertisement