ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు : ఏఎస్పీ
నెల్లూరు(క్రైమ్): ‘ఆరోగ్యం విషయంలో పోలీస్ సిబ్బంది అశ్రద్ధగా ఉండొద్దు. తగిన జాగ్రత్తలు పాటించాలి’ అని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో పారా మెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీహెచ్‌పీ) సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు 24 గంటలూ విధులు నిర్వహిస్తుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం బాగుంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలుంటే తక్షణమే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం జనరల్ ఫిజీషియన్, లివర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ల్యాప్రోస్కోపిక్, గైనకాలజీ, పల్మనాలజీ, ఈఎన్టీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్, డెంటల్ తదితర విభాగాలకు చెందిన వైద్యులు పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌పీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, కార్యదర్శి శేషయ్య, పోలీసు వైద్యులు అఖిలేష్, ప్రముఖ వైద్యనిపుణులు పి.మాధవ్‌రావు, బి.రాజేంద్రరెడ్డి, పి.సురేంద్రకుమార్, ఎం.వెంకటతరుణ్, పి.సుధీర్, కె.భాస్కర్, బి.రాజశేఖరరెడ్డి, ఎస్.శ్వేత, ప్రేమదీప్, పి.వసుమతి, డి.అజయ్‌కుమార్, తరుణ్, డి.సుస్మిత, లోకేశ్వరి, అనిల్‌కుమార్, డీఎస్పీలు, సిఐలు, ఎస్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు : ఏఎస్పీ


