పెన్నాకు పోటెత్తిన వరద
నెల్లూరు(అర్బన్): ౖెపతట్టు ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి భారీ వరద వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ అధికారులు ఒకేదఫా దిగువ పెన్నానదిలోకి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో పెన్నానదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఈ విషయం తెలిసిన మంత్రి నారాయణ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. అలాగే టీడీపీ శ్రేణులతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడుతూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని పునరావాసాలకు తరలించి బాధితులకు అండగా ఉండాలని సూచించారు. శుక్రవారం సాయంత్రానికి నెల్లూరు నగరంలోని జాకీర్‌హుస్సేన్ నగర్, కిసాన్ నగర్ లోతట్టు ప్రాంతాల్లోకి పెన్నానది వరదనీరు చేరింది. దీంతో కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
సంగం బ్యారేజీకి..
సంగం: మండలంలోని సంగం పెన్నా బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం సోమ శిల, బీరాపేరు, బొగ్గేరు వాగుల నుంచి వరద భారీగా చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లు పూర్తిగా తెరిచి 1,39,700 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. అధికారులు పెన్నా పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు.
బ్యారేజ్ నుంచి విడుదలవుతున్న వరద జలాలు
ఆనకట్ట వద్ద భారీగా ప్రవహిస్తున్న నీరు
పెన్నాకు పోటెత్తిన వరద


