స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
● మరొకరికి తీవ్రగాయాలు
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన ఆత్మకూరు మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ఎస్‌కే జిలానీ కథనం మేరకు.. వింజమూరు మండలానికి చెందిన సురేష్ నాయుడు (30) పని నిమిత్తం బైక్‌పై శంకర్‌నగరం వెళ్లాడు. తిరిగి వింజమూరుకు వెళ్తుండగా ఆత్మకూరు – వింజమూరు మార్గంలోని పొనుగోడు గ్రామానికి వెళ్లే అడ్డరోడ్డు మలుపు సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్నాడు. దీంతో సురేష్ రోడ్డుపై పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎదురు బైకుపై ఉన్న వ్యక్తికి గాయాలైనట్లు ఎస్సై వివరించారు. క్షతగ్రాతుడి వివరాలు తెలియలేదని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.


