రైల్లోంచి పడి వ్యక్తి మృతి
మనుబోలు: రైల్లోంచి పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మనుబోలు రైల్వేస్టేషన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. మనుబోలు రైల్వేస్టేషన్ సౌత్ ఎండ్ వద్ద 145 / 12 – 14 కిలోమీటర్ డౌన్ లైన్ వద్ద గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. గ్రే కలర్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, షార్టును ధరించి ఉన్నారు.
విద్యార్థుల అదృశ్యం
నెల్లూరు సిటీ: ధనలక్ష్మీపురంలోని శ్రీచైతన్య స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారంటూ నెల్లూరు రూరల్ పోలీసులకు ప్రిన్సిపల్ శనివారం ఫిర్యాదు చేశారు. సదరు స్కూల్ హాస్టల్లో చిల్లకూరు మండలంలోని చింతవరానికి చెందిన లోకేష్, అనంతసాగరం మండల దేవరాయపల్లికి చెందిన రాకేష్ పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ గురువారం సాయంత్రం అదృశ్యమయ్యారు. విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. సీఐ వేణు దర్యాప్తు చేస్తున్నారు.
డిగ్రీ పరీక్షలకు
976 మంది గైర్హాజరు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శనివారం నిర్వహించిన డిగ్రీ పరీక్షలకు 976 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణాధికారి మధుమతి తెలిపారు. 14,808 మందికి గానూ 13,832 మంది హాజరయ్యారని చెప్పారు. నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థి డీబారయ్యారని పేర్కొన్నారు.
పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్ : రూ.130
లేయర్ : రూ.115
బ్రాయిలర్ చికెన్ : రూ.236
స్కిన్‌లెస్ చికెన్ : రూ.260
లేయర్ చికెన్ : రూ.195
నిమ్మ ధరలు
పెద్దవి : రూ.30
సన్నవి : రూ.20
పండ్లు : రూ.10
రైల్లోంచి పడి వ్యక్తి మృతి
రైల్లోంచి పడి వ్యక్తి మృతి
రైల్లోంచి పడి వ్యక్తి మృతి


