Who is RR's sensation Dhruv Jurel? All you need to know - Sakshi
Sakshi News home page

IPL 2023: తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు.. ఎవరీ ధ్రువ్ జురెల్? వీడియో వైరల్‌

Published Thu, Apr 6 2023 1:06 PM

Who is RRs sensation Dhruv Jurel - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేసింది. తాజాగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి మరో యువ సంచలనం పుట్టుకొచ్చాడు. అతడే రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ఆటగాడు ధ్రువ్ జురెల్. ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఓటమిపాలైనప్పటికీ ధ్రువ్ మాత్రం తన సంచలన ఇన్నింగ్స్‌తో అందరి అకట్టుకున్నాడు. కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ముఖ్యంగా ఆర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన 19 ఓవర్‌లో ధ్రువ్ ఆడిన షాట్‌లు వేరే లెవల్‌ అని చెప్పుకోవాలి.  ఇక ఈ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా తన ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన జురెల్ కోసం ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ఎవరీ ధ్రువ్ జురెల్?
22 ఏళ్ల ధ్రువ్ జురెల్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించాడు. దేశీవాళీ క్రికెట్‌లో ధ్రువ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అదే విధంగా అతడు 2020 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన ధ్రువ్ జురెల్ 89 పరుగులు సాధించాడు. ఇక తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 587 పరుగులు సాధిచాడు.

ముఖ్యంగా 2022-23 రంజీ సీజన్‌లో నాగాలండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జురెల్ అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వచ్చిన అతడు 329 బంతులు ఎదుర్కొని 249 పరుగులు చేశాడు. ఇక టీ20ల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 4 టీ20లు మాత్రమే ఆడిన  ధ్రువ్ 89 పరుగులు చేశాడు.

కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు రాజస్తాన్‌ రాయల్స్‌ ధ్రువ్ జురెల్‌ను కొనుగోలు చేసింది. కానీ ఆసీజన్‌లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది సీజన్‌లో తనకు వచ్చిన మాత్రం అతడు సద్వినియోగం చేసుకున్నాడు.
చదవండి: IPL 2023-DC vs RR: రాజస్తాన్‌ రాయల్స్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఓపెనర్‌ దూరం! ఇక కష్టమే

Advertisement
Advertisement