బౌలింగ్‌ చాలెంజ్‌ : కోహ్లి రచ్చ మాములుగా లేదు

Watch Virat Kohli Fun During Bowling Challenge With RCB Bowlers - Sakshi

దుబాయ్‌ : విరాట్‌ కోహ్లి అంటేనే ఉత్సాహానికి పెట్టింది పేరు. బ్యాటింగ్‌లో పరుగుల వరద పారించడం ఒక్కటే కాదు.. కోహ్లికి ఆనందం వచ్చినా.. బాధ కలిగినా అస్సలు తట్టుకోడు. ఆటగాడిగా, బ్యాట్స్‌మన్‌గా.. ఒక కెప్టెన్‌గా ఇది ఎన్నోసార్లు నిరూపితమయ్యింది. కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్లను ప్రోత్సహించడంలో కోహ్లి శైలి కాస్త భిన్నంగా ఉంటుంది. అది టీమిండియా కావొచ్చ్చ.. లేక ఐపీఎల్‌ టీం అయినా కావొచ్చు. సందర్భం ఏదైనా సరే కోహ్లి చేసే గోల మాములుగా ఉండదు. (చదవండి : వచ్చీ రాగానే.. 'క్లీన్‌ బౌల్ట్'‌)

తాజాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ దుబాయ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి బౌలింగ్‌ సెషన్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా అతను చేసిన హంగామా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లిలో ఉన్న టీమ్‌ లీడర్‌గా ఆటగాళ్లను ఎంకరేజ్‌ చేస్తున్న తీరు అతని కెప్టెన్సీ‌ ప్రతిభకు అద్దం పట్టేలా వీడియో ఉంది.

అసలు విషయానికి వస్తే.. శనివారం ఆర్‌సీబీ జట్టు బౌలింగ్‌ కోచ్‌ అడమ్‌ గ్రిఫిత్‌ బౌలింగ్‌ చాలెంజ్‌ పెట్టాడు. బౌలర్లను షార్ప్‌ షూటర్లుగా మార్చాలి.. అంతేకాదు పదునైన యార్కర్లు సంధించాలనే ఈ చాలెంజ్‌ ఏర్పాటు చేసినట్లు గ్రిఫిత్‌ తర్వాత పేర్కొన్నాడు. చాలెంజ్‌లో భాగంగా బౌలర్లంతా కింద పడివున్న స్టంప్‌ను తాకేలా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో బౌలర్‌కు 10 బంతులు వేసే అవకాశం ఉంటుంది. అలా వికెట్లను తాకే దానిని బట్టి 1,3,5 ఇలా పాయింట్లు ఇస్తారు. ఈ చాలెంజ్‌లో నవదీప్‌ సైనీ, యజువేంద్ర చహల్‌, ఇసురు ఉడనా, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమేశ్‌ యాదవ్‌ మిగతా బౌలర్లు పాల్గొన్నారు. (చదవండి : చిట్టితల్లి నిన్ను చాలా మిస్సవుతున్నా)

ఇదంతా ఒక ఎత్తు అయితే కోహ్లి చేసిన రచ్చ మరొక ఎత్తు. బౌలర్లు తమ బంతులను సంధించగానే కోహ్లి గట్టిగా అరుస్తూ వారిని ఎంకరేజ్‌ చేయడం.. క్రీజులోకి పరిగెత్తుకొచ్చి డ్యాన్స్‌ చేయడం.. కౌగిలించుకోవడం.. ముద్దులు పెట్టడం.. ఇలా నానా హంగామా చేశాడు. ఒక కెప్టెన్‌గా తన వాళ్లను ఎంకరేజ్‌ చేసిన తీరు అద్భుతం. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. కోహ్లి హంగామాను తప్పక చూసి తీరాల్సిందే. ఇక బెంగళూరు జట్టు విషయానికి వస్తే పేపర్‌పై బలంగా కనిపించే జట్టు అసలు ఆటలో మాత్రం చతికిలపడుతుంది. 12 సీజన్లలో ఒక్కసారి కూడా ఆర్‌సీబీ జట్టు టైటిల్‌ గెలవలేకపోయింది. బలమైన బ్యాటింగ్‌ లైనఫ్‌తో బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి. (చదవండి : బౌలర్లు జాగ్రత్త.. కోహ్లి దులిపేస్తున్నాడు!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top