Tata IPL 2022: Wankhede Stadium To Host Delhi Capitals Vs Rajasthan Royals On April 22 - Sakshi
Sakshi News home page

IPL 2022 DC Vs RR Venue: ఢిల్లీ జ‌ట్టులో క‌రోనా కేసులు .. బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం!

Apr 20 2022 8:38 PM | Updated on Apr 21 2022 7:42 AM

Wankhede Stadium to host Delhi Capitals vs Rajasthan Royals on April 22 - Sakshi

IPL.COM

ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టులో క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐపీఎల్‌-2022లో 34 మ్యాచ్ వేదికలో బీసీసీఐ మార్పు చేసింది. పూణే వేదికగా  ఢిల్లీ క్యాపిటల్స్,  రాజస్థాన్ రాయల్స్ జ‌ట్ల  మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్‌ను ముంబైలోని వాంఖడే స్టేడియంలో జ‌ర‌గ‌నున్న‌ట్లు బీసీసీఐ పేర్కొంది. అయితే మ్యాచ్ మాత్రం షెడ్యూల్ ప్ర‌కారం.. ఏప్రిల్ 22న జ‌ర‌గ‌నుంది. కాగా తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆట‌గాడు టిమ్ సీఫర్ట్ క‌రోనా బారిన ప‌డ్డాడు.

దీంతో ఢిల్లీ జ‌ట్టులో క‌రోనా కేసులు సంఖ్య 7కు పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా అంత‌కుముందు ఢిల్లీ జట్టులో ప్యాట్రిక్ ఫర్హార్ట్ (ఫిజియో), మిచెల్ మార్ష్ , చేతన్ కుమార్ (స్పోర్ట్స్ మసాజ్‌ థెరపిస్ట్), డాక్టర్ అభిజిత్ సాల్వి (టీమ్ డాక్టర్), ఆకాశ్ మానే (సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్)లకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

చ‌ద‌వండి: IPL 2022: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌.. అరుదైన రికార్డుకు చేరువ‌లో వార్న‌ర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement