
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆసియాకప్ కోసం తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. గరువారం ముంబైలోని బికేసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కోహ్లి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్న కోహ్లి తిరిగి ఆసియా కప్‌లో బరిలోకి దిగననున్నాడు.
ఇక కోహ్లి గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించి మూడేళ్లు దాటుతోంది. ఈ ఏడాది నాలుగు అంతర్జాతీయ టీ20 ఆడిన కోహ్లి 81 పరుగులు మాత్రమే చేశాడు. అయితే కోహ్లి ఆసియా కప్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా ఆసియా కప్‌లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆగస్టు 28న తల పడనుంది.
అయితే పాకిస్తాన్‌పై కింగ్ కోహ్లికి తిరుగులేని రికార్డు ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత బ్యాటర్లు అంతా విఫలమైనా.. కోహ్లి మాత్రం అర్ధసెంచరీతో మెరిశాడు. మరోసారి పాక్‌పై కోహ్లి బ్యాట్ ఝులిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
ఇక ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా శ్రీలంక-ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం భారత్, పాక్ జట్లు తమ జట్లను ప్రకటించాయి. మిగితా జట్లను కూడా ఆయా దేశ క్రికెట్ బోర్డులు ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
ఆసియకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్.
స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్
ఆసియకప్‌కు పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, షాహనావాజ్ ఆఫ్రిది దహానీ మరియు ఉస్మాన్ ఖదీర్
#ViratKohli has started the practice for #AsiaCup 2022 at BKC Complex Mumbai.pic.twitter.com/KkhgGWGYti
— Lakshya Lark (@lakshyalark) August 11, 2022
చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి..