సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. మరో స్టార్‌ ప్లేయర్‌ టోర్నీ నుంచి అవుట్‌ | SRHs David Payne Ruled Out of IPL 2026 with Ankle Injury | Sakshi
Sakshi News home page

IPL 2026: సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. మరో స్టార్‌ ప్లేయర్‌ టోర్నీ నుంచి అవుట్‌

Apr 16 2026 6:09 PM | Updated on Apr 16 2026 6:41 PM

SRHs David Payne Ruled Out of IPL 2026 with Ankle Injury

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్‌, ఇంగ్లండ్ వెట‌ర‌న్ డేవిడ్ పేన్ చీల‌మండ గాయం కార‌ణంగా ఐపీఎల్‌-2026 సీజ‌న్ నుంచి వైదొలిగాడు. ఈ విష‌యాన్ని ఎస్ఆర్‌హెచ్ మేనెజ్‌మెంట్ ఎక్స్ వేదిక‌గా ధ్రువీక‌రించింది. "డేవిడ్ పేన్ చీలమండ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. 

అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాము"ఎస్‌ఆర్‌హెచ్ ఎక్స్ వేదికగా పేర్కొంది. వాస్తవానికి ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌ను వేలంలో ఎవరు కొనుగోలు చేయలేదు. కానీ ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు జాక్ ఎడ్వర్డ్స్ గాయపడడంతో.. అతడి స్ధానంలో పేన్‌తో సన్‌రైజర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. 

ఆరెంజ్ ఆర్మీ తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన పేన్‌, 14 ఎకానమీ రేటుతో 2 వికెట్లు పడగొట్టాడు. తాజాగా మరో ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ కూడా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి పేన్ చేరాడు. మరోవైపు వెన్ను నొప్పితో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. 

క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో కమ్మిన్స్ ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. కమ్మిన్స్ కమిన్స్ ఏప్రిల్ 17న హైదరాబాద్ చేరుకుంటాడు.  ఏప్రిల్ 18న ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్  తో జరిగే మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement