NZ Vs Pak Series Cancellation: కివీస్‌ సిరీస్‌ రద్దు.. కావాలనే మాపై కుట్రలు పన్నుతున్నారు

Shoaib Akhtar Slams New Zeland Just Killed Pakistan Cricket Tour Cancel - Sakshi

Pakistan Interior Minister Says International Conspiracy.. పాకిస్తాన్‌లో సరైన భద్రత లేదంటూ న్యూజిలాండ్‌ జట్టు చివరి నిమిషంలో సిరీస్‌ను రద్దు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మరికొద్ది నిమిషాల్లో తొలి మ్యాచ్‌ మొదలవుతుందనగా కివీస్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకోవడం సగటు అభిమానిని షాక్‌కు గురిచేసింది.  ఈ ఊహించని హఠాత్పరిణామానికి పీసీబీ కూడా ఉలిక్కిపడింది. చాలా సంవత్సరాల తర్వత ఒక విదేశీ జట్టు మా గడ్డపై అడుగుపెట్టిందన్న ఆనందం పీసీబీకి మిగల్లేదు. ఒక్కసారిగా అయోమయంలో పడింది... ఉన్నపళంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పాలంది. లోపాలుంటే సరిదిద్దుకుంటామంది. భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టపరుస్తామంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

చదవండి: పాకిస్తాన్‌లో భద్రత లేదంటూ... కివీస్‌ పర్యటన రద్దు!


పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ కూడా కివీస్‌ సిరీస్‌ రద్దుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. '' మాపై కావాలనే కుట్రలు పన్నుతున్నారు. కొన్ని అతీత శక్తులు మా దేశంలో క్రికెట్‌ జరగకుండా అడ్డుపడుతున్నాయి. అఫ్గానిస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాల అనంతరం మా దేశంపై పనిగట్టుకొని బురద జల్లుతున్నారు. ఉన్న పళంతగా కివీస్‌ సిరీస్‌ రద్దు చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. వాళ్లు భద్రతా కారణాల రిత్యా అనే సాకు చూపుతున్నారు.. కానీ భద్రత విషయంలో పీసీబీ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కివీస్‌ బోర్డుకు ఎటువంటి నష్టం కలగకుండా ఆటగాళ్లను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చింది. అయినప్పటికీ భద్రత అనే అంశాన్ని లేవనెత్తి మమ్మల్ని కించపరిచారు.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా న్యూజిలాండ్‌ జట్టు సిరీస్‌ను అర్థంతరంగా రద్దు చేసుకోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు. కాగా పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ కివీస్‌ సిరీస్‌ రద్దు చేసుకోవడంపై ట్విటర్‌లో ఘాటుగా స్పందించాడు. ''న్యూజిలాండ్‌ జట్టు పాకిస్తాన్‌ క్రికెట్‌ను చంపేసింది.అర్థంతరంగా సిరీస్‌ రద్దు చేసుకున్న కివీస్‌ ముందు నేను కొన్ని ప్రశ్నలు ఉంచుతున్నా. క్రైస్ట్‌చర్చిలో జరిగిన పేలుడులో 9 మంది పాకిస్తానీలు చనిపోయారు. మరి అప్పుడు మీకు భద్రత గుర్తుకురాలేదా..? అంతేగాక ఈ విషయంలో అప్పట్లో పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌కు మద్దతుగా నిలిచింది. కరోనా సంక్షోభం జోరుగా ఉన్న సమయంలో మేం మీ దేశంలో పర్యటించాం. అప్పడు మా ఆటగాళ్లకు మీ అధికారులు ఇచ్చిన భద్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..'' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా కివీస్‌ పాక్‌ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్‌ ఆడాల్సింది.

చదవండి: ENG TOUR OF PAK IN DOUBT: గంటల వ్యవధిలో పాక్‌ క్రికెట్‌కు మరో షాక్‌.. ?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top