DC Vs CSK:విజయానందంలో ఆ ఢిల్లీ ఆటగాడు ఏం చేశాడో చూడండి..!

Shimron Hetmyer Jumps On Dwayne Bravo Back After DC Win Over CSK: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో డీసీ జట్టును విజయం వరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. మ్యాచ్ గెలిపించానోచ్ అంటూ ఢిల్లీ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్.. ప్రత్యర్ధి ఆటగాడు డ్వేన్ బ్రావో భుజాలపైకి ఎక్కి తన సంతోషాన్ని పంచుకున్నాడు. బ్రావో సైతం హెట్‌మైర్‌ను భుజాలపై మోస్తూ కాసేపు సందడి చేశాడు. ప్రత్యర్ధి జట్టు ఆటగాడితో విజయానందాన్ని షేర్ చేసుకోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Nail-biting finish! 👌 👌@DelhiCapitals hold their nerve & beat #CSK by 3⃣ wickets in a last-over thriller. 👍 👍 #VIVOIPL #DCvCSK
Scorecard 👉 https://t.co/zT4bLrDCcl pic.twitter.com/ZJ4mPDaIAh— IndianPremierLeague (@IPL) October 4, 2021
కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఐపీఎల్‌లో తమ 100వ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఢిల్లీ జట్టు సైతం తడబడినప్పటికీ .. ఆఖర్లో హెట్‌మైర్(18 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ఢిల్లీ ఖాతాలో 20 పాయింట్లు చేరాయి.
చదవండి: యాషెస్ సిరీస్ డౌటే.. మెలిక పెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
సంబంధిత వార్తలు