
సౌతాంప్టన్: టీ20 బ్లాస్ట్ 2021లో భాగంగా ససెక్స్ ఆటగాడు రషీద్ ఖాన్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రషీద్ కొట్టిన సిక్స్.. ధోని హెలికాప్టర్ షాట్‌లా కనిపిస్తున్నా.. దాంతో దీన్ని పోల్చలేమని అభిమానులు అంటున్నారు. అతను కొట్టిన షాట్ క్రికెట్ పుస్తకాల్లో లేదని.. దీనికి మనమే ఒక పేరు పెట్టాల్సిన అవసరం ఉందంటూ వినూత్న కామెంట్లు చేశారు. విషయంలోకి వెళితే.. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడేందుకు రషీద్ లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా శుక్రవారం ససెక్స్, హాంప్‌షైర్‌ల మధ్య మ్యాచ్ జరిగింది.
ససెక్స్ తరపున ఆడుతున్న రషీద్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. రషీద్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. స్కాట్ కర్రీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మూడో బంతిని రషీద్ ఖాన్ భారీ సిక్స్ సందించాడు. ఆ సిక్స్ చూస్తే ధోని హెలికాప్టర్ షాట్‌లా కనిపిస్తున్నా.. సాధారణంగా హెలికాప్టర్ షాట్‌లో బంతి మిడాన్ లేదా లెగ్‌సైడ్ దిశగా వెళ్తుంది. కానీ రషీద్ కొట్టిన సిక్స్ మాత్రం లాంగాఫ్ మీదుగా వెళ్లింది. ఇంకేముంది దీనికి సంబంధించిన వీడియోను రషీద్ తన ట్విటర్‌లో షేర్ చేస్తూ.. '' క్రికెట్ ఫ్యాన్స్ ఈ షాట్‌కు ఒక పేరు పెట్టండి'' అని కామెంట్ చేశాడు. అయితే రషీద్ కామెంట్‌పై ఫ్యాన్స్ స్పందింస్తూ..'' కొన్ని షాట్లు పుస్తకాల్లో ఉండవు.. వాటికి మనమే ఒక పేరు పెట్టాలి.. ఏం పెడితే బాగుంటుందో చెప్పండి'' అంటూ పేర్కొన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రవి బొపారా 62, లూక్ రైట్ 54 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హాంప్‌షైర్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. జేమ్స్ విన్స్ మెరుపు సెంచరీ(59 బంతుల్లో 102; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించగా.. డీఆర్కీ షార్ట్ 35 పరుగులు చేశాడు.
Some shots are not in the book but you just need to write them . Can anyone suggest name for it ?🙈🙈 pic.twitter.com/M70bzL5zNG
— Rashid Khan (@rashidkhan_19) July 17, 2021