
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. గుజరాత్ టైటాన్స్ స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. కాగా ఐపీఎల్‌లో రషీద్ ఖాన్‌కు ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. గుజరాత్ టైటాన్స్ తరపున కూడా ఇదే తొలి హ్యాట్రిక్ కావడం మరో విశేషం.
ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతికి రసెల్‌ను, రెండో బంతికి సునీల్ నరైన్‌ను, మూడో బంతికి శార్దూల్ ఠాకూర్‌ను పెవిలియన్ పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా రషీద్ ఖాన్‌కు టి20 కెరీర్‌లో ఇది నాలుగో హ్యాట్రిక్ కావడం విశేషం.
ఇక ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసిన 19వ బౌలర్‌గా రషీద్ నిలిచాడు. ఇక అత్యధికంగా ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు. అమిత్ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేయగా.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ రెండుసార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు.
Rashid Khan now has hat-tricks in...
— JioCinema (@JioCinema) April 9, 2023
T20Is ✅
BBL ✅
CPL ✅#TATAIPL 💥✅#GTvKKR #IPLonJioCinema | @rashidkhan_19 pic.twitter.com/FAPTM7j2K3