#Batter-Bowler-Fielder: అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే

Batter-Bowler-Catch-Taken-Player-All Three From-Afghanistan KKR Vs GT - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా కేకేఆర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. బహుశా ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయేమో. విషయంలోకి వెళితే.. గుజరాత్‌తోమ్యాచ్‌లో కేకేఆర్‌ ఓపెనర్‌ రహమనుల్లా గుర్బాజ్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు.

అఫ్గానిస్తాన్‌కు చెందిన గుర్బాజ్‌ 39 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 81 పరుగులు చేసి గుజరాత్‌కు చుక్కలు చూపించాడు. ఒక దశలో దాటిగా ఆడుతున్న గుర్బాజ్‌ను ఔట్‌ చేయడానికి బౌలర్లు తంటాలు పడ్డారు. అయితే నూర్‌ అహ్మద్‌ ఎట్టకేలకు గుర్బాజ్‌ను ఔట్‌ చేయగలిగాడు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ రెండో బంతిని గుర్బాజ్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అయితే అక్కడే రషీద్‌ ఖాన్‌ ఎలాంటి తప్పిదం చేయకుండా క్యాచ్‌ అందుకున్నాడు. 


Photo: IPL Twitter

అయితే మీరు ఒక విషయం గమనించారో లేదో.. బ్యాటింగ్‌ ఆడిన రహమనుల్లా గుర్బాజ్‌, బౌలింగ్‌ వేసిన నూర్‌ అహ్మద్‌, క్యాచ్‌ పట్టిన రషీద్‌ ఖాన్‌.. ముగ్గురు ఒక దేశానికి చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ప్రస్తుతం ఈ ముగ్గురు అఫ్గానిస్తాన్‌ జట్టులో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలా బ్యాటింగ్‌ ఆడినోడు.. బౌలింగ​ వేసినోడు.. క్యాచ్‌ పట్టినోడు ఒకే దేశానికి చెందినవారు కావడం అరుదుగా జరుగుతుంది. తాజాగా ఐపీఎల్‌ అందుకు వేదిక అయింది.

చదవండి: Shardul Thakur: మోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌.. ప్రయోగం బెడిసికొట్టింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top