IPL 2023: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. ఫలితం దక్కింది.. ఇకపై: మార్కరమ్‌

 Rahul Tripathi played a incredible knock for us sasy Aiden Markram - Sakshi

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి విజయం నమోదు చేసింది. ఉప్పల్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఘన విజయం సాధించింది. బౌలింగ్‌ బ్యాటింగ్‌లో అదరగొట్టిన ఆరెంజ్‌ ఆర్మీ.. పంజాబ్‌ను చిత్తు చేసింది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేదించింది.

సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో రాహుల్‌ త్రిపాఠి(74 నాటౌట్‌) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా.. కెప్టెన్‌ మార్కరమ్‌(37నాటౌట్‌) రాణించాడు. అంతకుముందు బౌలింగ్‌లో స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే నాలుగు వికెట్లతో పంజాబ్‌ను దెబ్బ తీశాడు. ఇక ఈ ఘన విజయంపై మ్యాచ్‌ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ స్పందించాడు.

ఈ విజయం చాలా ప్రత్యేకమైనది 
మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. "ఈ విజయం మాకు చాలా స్పెషల్‌. ఛేజింగ్‌ ఆరంభంలో మాకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. ఆఖరికి విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. మా జట్టుకు అద్భుతమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఇంతమం‍ది అభిమానుల మధ్య మా తొలి విజయాన్ని నమోదు చేయడం ఆనందంగా ఉంది.

అది సరైన నిర్ణయం కాదని తెలుసు.. అయితే ప్రయోగం ఫలించింది
ఇక ఈ మ్యాచ్‌లో అదిల్ రషీద్ వంటి స్టార్‌ స్పిన్నర్‌ను పక్కన పెట్టి మయాంక్ మార్కండేను ఆడించడం సరైన నిర్ణయం కాదని నాకు తెలుసు. కానీ నేను ప్రయోగం చేయాలనుకున్నాను. నేను చేసిన ప్రయోగం ఫలించింది.  మార్కండే అద్భుతంగా రాణించాడు.

అదే విధంగా రాహుల్‌ త్రిపాఠి గురుంచి ఎంత చెప్పినా తక్కువే. అతడు కొం‍చెం కూడా ఒత్తిడి లేకుండా ఆడాడు. రాహుల్‌ తన క్లాస్‌ ఏంటో మరోసారి చూపించాడు. ఇది మాకు తొలి విజయం. తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తాం" అని మార్కరమ్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: మరి నువ్వు మారవా బ్రో.. 13 కోట్లు తీసుకున్నావు! ఇదేనా ఆట?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top