'రాసిపెట్టుకోండి.. ఆర్సీబీపై అతడు విధ్వంసం సృష్టిస్తాడు' | R Ashwin Backs This SRH Star To Have Night To Remember In IPL Opener Against RCB | Sakshi
Sakshi News home page

IPL 2026: 'రాసిపెట్టుకోండి.. ఆర్సీబీపై అతడు విధ్వంసం సృష్టిస్తాడు'

Mar 28 2026 4:41 PM | Updated on Mar 28 2026 4:48 PM

R Ashwin Backs This SRH Star To Have Night To Remember In IPL Opener Against RCB

ఐపీఎల్‌-2026 సీజన్‌ మరో కొన్ని గంటల్లో షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ అద్భుతమైన ప్రదర్శన చేసే అవకాశముందని అశ్విన్‌ జోస్యం చెప్పాడు. క్లాసెన్ గతేడాది నుంచి చెప్పుకోదగ్గ ప్రదరన్శన చేయలేకపోతున్నాడు. ఐపీఎల్‌-2025తో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ క్లాసెన్‌ నిరాశపరిచాడు.

గత 20 నెలలలో 65 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్‌.. 28.80 సగటుతో కేవలం 1440 పరుగులు మాత్రమే సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో క్లాసెన్‌ ఎలా రాణిస్తాడోనని అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు.

తొలి మ్యాచ్‌లో ఓ అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నాను. గత 18 నెలలగా పెద్దగా రాణించకపోయిన హెన్రిచ్‌ క్లాసెన్‌.. ఈ మ్యాచ్‌లో "గుర్తుండిపోయే ఇన్నింగ్స్" ఆడే అవకాశముంది. అదేవిధంగా ఆర్సీబీ తరపున జాకబ్‌ బెతల్‌ కీలక ఆటగాడిగా నిలవనున్నాడని తన యూట్యూబ్‌ ఛానల్‌లో అశ్విన్‌ పేర్కొన్నాడు.

కాగా చిన్నస్వామి స్టేడియంలో క్లాసెన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇదే వేదికగా ఐపీఎల్‌-2023లో ఆర్సీబీపై అతడు కేవలం 51 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మరోవైపు జాకబ్‌ బెతల్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌-2026లో భారత్‌తో జరిగిన సెమీఫైనల్లో బెతల్‌ విధ్వంసకర సెంచరీతో సత్తాచాటాడు.
చదవండి: పెళ్లిపీటలెక్కనున్న కావ్య మారన్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement