Players from both teams smash hundreds in same IPL match for first time ever - Sakshi
Sakshi News home page

IPL 2023: సెంచరీలతో చెలరేగిన కోహ్లి, క్లాసెన్‌.. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలి సారి

May 19 2023 9:03 AM | Updated on May 19 2023 10:19 AM

Players from both teams smash hundreds in same IPL match for first time  - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  ఆర్సీబీ కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బెంగళూరు విజయంలో విరాట్‌ కోహ్లి(100) సెంచరీతో కీలక పాత్ర పోషించగా.. డుప్లెసిస్‌(71) పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఎస్ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. ఎస్ఆర్‌హెచ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ తొలి ఐపీఎల్‌ సెంచరీ సాధించాడు. 51 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్‌ 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్‌ 27 పరుగులతో పర్వాలేదనపించాడు.

అరుదైన రికార్డు..
ఇక ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ఓ అరుదైన రికార్డుకు వేదికైంది. ఒకే మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు సెంచరీలు సాధించడం ఐపీఎల్‌ చరిత్రలో ఇదే తొలి సారి. ఈ లీగ్‌ 16 ఏళ్ల చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. అదే విధంగా ఒక మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు సాధించడం ​ఇది మూడో సారి కావడం విశేషం.

అంతకుముందు 2016 ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ తరపున ఆడిన ఏబీ డివిలియర్స్‌, కోహ్లి గుజరాత్‌ లయన్స్‌పై సెంచరీలు సాధించారు. ఆ తర్వాత 2019 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించిన జానీ బెయిర్‌ స్టో, డేవిడ్‌ వార్నర్‌ ఆర్సీబీపైన సెంచరీలు సాధించారు. ఇప్పుడు తాజాగా ఐపీఎల్‌లో ఒకే మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన ఆటగాళ్లుగా కోహ్లి, క్లాసెన్‌ నిలిచారు.
చదవండిIPL 2023: వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్‌క్రమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement