NZ Vs SL: మెండిస్ మెరుపులు! ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. రచిన్ రవీంద్ర చివర్లో..

New Zealand vs Sri Lanka, 3rd T20I: శ్రీలంకతో మూడో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
అప్పుడలా.. ఇప్పుడిలా
రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఆఖరిదైన సిరీస్‌లో ఓటమి పాలైన లంక.. వన్డే సిరీస్‌లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.
వరుస ఓటముల నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను గల్లంతు చేసుకోవడమే గాకుండా.. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీకి నేరుగా అర్హత సాధించే ఛాన్స్‌నూ మిస్ చేసుకుంది. తాజాగా మూడో టీ20లో ఓడి ఈ సిరీస్‌ను కూడా ఆతిథ్య కివీస్‌కు సమర్పించుకుంది.
దంచికొట్టిన మెండిస్
క్వీన్స్‌టౌన్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(25) పర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ మాత్రం అదరగొట్టాడు.
ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 48 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 73 పరుగులు రాబట్టాడు. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ పెరెరా 21 బంతుల్లో 33 పరుగులు చేయగా.. ధనంజయ డిసిల్వ 9 బంతుల్లోనే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
మరోసారి చెలరేగిన సీఫర్ట్
కానీ కెప్టెన్ దసున్ షనక(15) మరోసారి నిరాశపరిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పర్యాటక లంక 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ ఓపెనర్లలో టిమ్ సీఫర్ట్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ సిరీస్ కూడా కివీస్‌దే
48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 88 పరుగులతో కివీస్‌ను గెలుపుబాట పట్టించాడు. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ టామ్ లాథమ్ 31 పరుగులతో రాణించగా.. మరో బంతి మిగిలి ఉండగా రచిన్ రవీంద్ర రెండు పరుగులు తీసి కివీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో సిరీస్ న్యూజిలాండ్ సొంతమైంది. సీఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఇక శ్రీలంక కివీస్ పర్యటన ముగించుకుని ఉత్త చేతులతో ఇంటిబాట పట్టింది.
Rachin getting the job done for New Zealand 🇳🇿
Watch BLACKCAPS v Sri Lanka on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/EiupwKDY6N
— Spark Sport (@sparknzsport) April 8, 2023
Jimmy Neesham EPIC CATCH 🤩
Watch BLACKCAPS v Sri Lanka live and on-demand on Spark Sport #SparkSport #NZvSL pic.twitter.com/7pqK6A26pt
— Spark Sport (@sparknzsport) April 8, 2023
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు