
తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్‌బైజాన్‌కు చెందని ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. మ్యాచ్ మొదలవగానే తన పంచుల వర్షం కురిపించిన నిఖత్ ఎక్కడా ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వలేదు.
తొలి బౌట్‌లోనే ఆధిపత్యం చూపించిన నిఖత్ ఇస్మయిలోవా మొహంపై పంచ్‌లతో అటాక్ చేసింది. అయితే రిఫరీ అడ్డుకొని ఆర్‌ఎస్‌సీ(Referee Stops Contest) కింద నిఖత్ గెలిచినట్లు ప్రకటించాడు. ఇక నిఖత్ జరీన్ రౌండ్ ఆఫ్ 32లో ఆఫ్రికాకు చెందిన రౌమైసా బౌలమ్‌ను ఎదుర్కోనుంది. మరోవైపు సాక్షికూడా కొలంబియాకు చెందిన జోస్ మారియాను 5-0తో చిత్తు చేసింది.
#IND's🇮🇳 @nikhat_zareen starts off her campaign in style at IBA Women's World Boxing Championships 2023 🥊#WorldChampionships #Boxing pic.twitter.com/srfduaVL88
— Doordarshan Sports (@ddsportschannel) March 16, 2023