పూరన్‌ మహోగ్రరూపం | Nicholas Pooran Scores Second Fastest Fifty For Lucknow Super Giants, Achieves Feat During MI vs LSG IPL 2026 | Sakshi
Sakshi News home page

పూరన్‌ మహోగ్రరూపం

May 4 2026 8:48 PM | Updated on May 4 2026 8:48 PM

Nicholas Pooran Scores Second Fastest Fifty For Lucknow Super Giants, Achieves Feat During MI vs LSG IPL 2026

ఐపీఎల్‌ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 4) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ చెలరేగిపోయాడు. ఈ సీజన్‌లో దారుణంగా విఫలమవుతూ వచ్చిన అతను.. ఈ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, లక్నో తరఫున రెండో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ కూడా ఇతని పేరిటే ఉంది. 2023 ఎడిషన్‌లో కేవలం 15 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు.

తాజా హాఫ్‌ సెంచరీలో 7 సిక్సర్లు, ఓ బౌండరీ బాదిన పూరన్‌.. ఓవరాల్‌గా 21 బంతులు ఎదుర్కొని ఫోర్‌, 8 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. పూరన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌ (25 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న లక్నో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది.

ఒక్కసారి కుదుపు
పూరన్‌ క్రీజ్‌లో ఉన్నంత సేపు అతి భారీ స్కోర్‌ దిశగా సాగిన లక్నో.. అతను ఔట్‌ కాగానే ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. రెండు పరుగుల వ్యవధిలో (123-125) పూరన్‌తో పాటు మిచెల్‌ మార్ష్‌ (44) కూడా ఔటయ్యాడు. 

ఆ కొద్దిసేపటికే (148, 160 పరుగుల వద్ద) రిషబ్‌ పంత్‌ (15), అక్షత్‌ రఘువంశీ (11) కూడా పెవిలియన్‌ బాట పట్డారు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్‌ 164-5గా ఉంది. మార్క్రమ్‌ (10), హిమ్మత్‌ సింగ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో కార్బిన్‌ బాష్‌ 2, ఘజన్‌ఫర్‌, విల్‌ జాక్స్‌, రఘు శర్మ తలో వికెట్‌ తీశారు.

తుది జట్టు..
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, AM ఘజన్‌ఫర్, రఘు శర్మ
 

Advertisement
 
Advertisement
Advertisement