Eng Vs Nz Test Series 2022: New Zealand Announce 15 Member Squad For England Tests - Sakshi
Sakshi News home page

ENG Vs NZ Test Series 2022: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. జట్టును ప్రకటించిన న్యూజిలాండ్‌..!

May 31 2022 9:20 AM | Updated on May 31 2022 9:46 AM

New Zealand announce 15 member squad for England Tests - Sakshi

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యలతో కూడిన తమ కొత్త జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ సోమవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా కివీస్‌ మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జాన్‌2న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభం కానుంది. ఇక తొలి టెస్ట్‌కు గాయంతో బాధపడుతున్న హెన్రీ నికోల్స్ బ్యాకప్‌గా మైఖేల్ బ్రేస్‌వెల్‌ను న్యూజిలాండ్‌ సెలక్టెర్లు ఎంపిక చేశారు.

కాగా తొలుత 20 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రకటించింది. అయితే ఈ జట్టులో జాకబ్ డఫీ, బ్లెయిర్ టిక్నర్, రచిన్ రవీంద్ర, , బ్లెయిర్ టిక్నర్, రచిన్ రవీంద్ర, హమీష్ రూథర్‌ఫోర్డ్ వంటి ఆటగాళ్లను న్యూజిలాండ్‌ విడుదల చేసింది.. అయితే తొలి ప్రకటించన జట్టులో అవకాశం దక్కని అజాజ్ పటేల్ తిరిగి మళ్లీ చోటు దక్కింది. ఇక తొలి టెస్టుకు స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ దూరం కానున్నాడు.

న్యూజిలాండ్‌ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, క్యామ్ ఫ్లెచర్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్ , అజాజ్ పటేల్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్

చదవండి: IPL 2022: రియల్‌ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement