Neeraj Chopra: ఫైన‌ల్‌కు ముందు నీర‌జ్‌ జావెలిన్‌ను ఆ పాకిస్తానీ ఎందుకు తీసుకెళ్లాడు?

Neeraj Chopra:Arshad Nadeem Had Taken My Javelin Right Before The Final - Sakshi

ముంబై: టోక్యో  ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన విషయం తెలిసిందే.  అయితే కీలకమైన  ఫైన‌ల్‌కు ముందు  జరిగిన ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌నను టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్‌ చోప్రా బయటపెట్టాడు. ఫైనల్ ప్రారంభానికి ముందు ఒక్కసారిగా నా జావెలిన్  క‌నిపించ‌కుండా పోయింద‌ని అతడు తెలిపాడు. ఎంత వెతికిన నా జావెలిన్‌ కనిపించలేదు. అయితే స‌డెన్‌గా అది  పాకిస్థాన్‌కు చెందిన  న‌దీమ్ అర్ష‌ద్  చేతుల్లో క‌నిపించింది.

నా జావెలిన్‌తో అత‌డు అటూఇటూ తిరుగుతున్నాడు. అది చూసి.. భాయ్ ఆ జావెలిన్ ఇవ్వు. అది నాది. నేను ఫైన‌ల్లో దానినే విస‌రాలి అని అడిగాను. దీంతో అర్ష‌ద్ దానిని తిరిగి ఇచ్చేశాడు అని నీర‌జ్ చెప్పాడు. ఈ గంద‌ర‌గోళం వ‌ల్లే తాను త‌న తొలి త్రోను హడావిడిగా విస‌రాల్సి వ‌చ్చింద‌ని నీర‌జ్ అన్నాడు. కాగా జావెలిన్ త్రో ఫైనల్లో న‌దీమ్ అర్ష‌ద్   6 వ స్థానాన్ని దక్కించుకోవడానికి బాగా కష్టపడ్డాడని నీరజ్‌ తెలిపాడు. ఎప్పటినుంచో మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉందని అతను చెప్పాడు.

చదవండి: నీరజ్‌ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్‌ ఆగ్రహం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top