IND Vs NZ: మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ఏమి తప్పుకాదు..

Mayank Agarwal fielding on his knees against NZ is certainly not unfair Says MCC - Sakshi

Mayank Agarwal fielding on his knees against NZ is certainly not unfair:  కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌-భారత్‌ మధ్య జరిగిన తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. దీనిపై మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ క్రికెట్ సలహాదారు జానీ సింగర్‌ స్పందించారు. క్రికెట్‌లోని ఏ చట్టం కూడా మోకాళ్లపై ఫీల్డింగ్ చేయకూడదని తెలపలేదు అని సింగర్‌ చెప్పారు. ఆధునిక క్రికెట్‌లో  మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం సర్వసాధారణమైందని  అతను తెలిపారు. 

"ఫీల్డర్ మోకాళ్లపై ఫీల్డింగ్ చేయకూడదని క్రీడా చట్టాలలో ఏమీ లేదు. నిజానికి, ఇది ప్రస్తుత క్రికెట్‌లో  చాలా సాధారణం. మోకాళ్లపై  ఫీల్డింగ్ చేయడం ఖచ్చితంగా తప్పు కాదు. కానీ బౌలర్‌ బంతి వేసిన తర్వాత ఫీల్డర్ తన పొజిషన్‌ను మార్చుకుని మోకాళ్లపై ఫీల్డింగ్‌ చేస్తే అది కచ్చితంగా చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అప్పడు నిర్ణయం ఆన్-ఫీల్డ్ అంపైర్‌తో ముడి పడి ఉంటుంది అని సింగర్‌ పేర్కొన్నాడు.

చదవం‍డి: IND vs NZ: ఒక్క వికెట్‌.. అప్పుడు గెలుపు.. ఇప్పుడేమో ఇలా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top