ఒక్క హైదరాబాద్‌ ప్లేయర్‌కీ చోటులేదు: అజారుద్దీన్‌

IPL Auction 2021 Mohammad Azharuddin Very Disappointed With SRH - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ మినీ వేలం చెన్నైలో జరిగిన విషయం తెలిసిందే. గురువారం నాటి ఈ ఈవెంట్‌లో సన్‌రైజర్స్‌ ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసింది. జట్టు కేదార్‌ జాదవ్‌ (రూ. 2 కోట్లు), ముజీబ్‌ ఉర్‌ రహమాన్‌ (రూ.1.50 కోట్లు), జె.సుచిత్‌ (రూ. 30 లక్షలు)లను సొంతం చేసుకుంది. 

ఈ విషయం మీద స్పందించిన అజారుద్దీన్‌.. ‘‘హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టులో, హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడికి కూడా స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది’’ అని ట్వీట్‌ చేశారు. కాగా ఐపీఎల్‌ వేలంలో భాగంగా హైదరాబాద్‌ జట్టు నుంచి కె. భగత్‌ వర్మను రూ. 20 లక్షలు చెల్లించి చెన్నై సూపర్‌కింగ్స్‌ సొంతం చేసుకుంది. అదేవిధంగా.. ఆంధ్ర జట్టుకు చెందిన కేఎల్‌ భరత్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (రూ.20 లక్షలు), హరిశంకర్‌ రెడ్డిని (రూ. 20 లక్షలు) చెన్నై ఫ్రాంఛైజీ కొనుగోలు చేశాయి.   

చదవండి
వీళ్లిద్దరు చూడముచ్చటగా ఉన్నారు!    

ఐపీఎల్‌ 2021 మినీ వేలం.. పూర్తి వివరాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top