కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం | IPL 2026 Match 2: MI vs KKR Updates and Highlights | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

Mar 29 2026 7:02 PM | Updated on Mar 29 2026 11:13 PM

IPL 2026 Match 2: MI vs KKR Updates and Highlights

221 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్‌ శర్మ (38 బంతుల్లో 78; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ర్యాన్‌ రికెల్టన్‌ (43 బంతుల్లో 81; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర అర్ద శతకాలతో ముంబై గెలుపును ఖరారు చేశారు.  

అంతకుముందు రహానే (40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు), ఫిన్‌ అలెన్‌ (17 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 పరుగులు), అంగ్క్క్రిష్‌ రఘువంశీ (29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు), రింకూ సింగ్‌ (21 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 నాటౌట్‌) సత్తా చాటడంతో కేకేఆర్‌ భారీ స్కోర్‌ చేసింది.

రికెల్టన్‌ (81) ఔట్‌
15.2వ ఓవర్‌- 184 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అనుకూల్‌ రాయ్‌ అద్భుతమైన త్రో వేయడంతో ర్యాన్‌ రికెల్టన్‌ (81) ఔటయ్యాడు.

సూర్యకుమార్‌ యాదవ్‌ (16) ఔట్‌
14.2వ ఓవర్‌-179 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కార్తీక్‌ త్యాగి బౌలింగ్‌లో రింకూ సింగ్‌ క్యాచ్‌ పట్టడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ ఔటయ్యాడు. 

రోహిత్‌ శర్మ 78 (38) ఔట్‌
11.5వ ఓవర్‌- 148 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో అనుకూల్‌ రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. రికెల్టన్‌కు (67) జతగా సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

లక్ష్యం దిశగా దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌
కేకేఆర్‌ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌ దూసుకుపోతుంది. 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 110 పరుగులు చేసి, లక్ష్యానికి మరో 111 పరుగుల దూరంలో ఉంది. రోహిత్‌ శర్మ (59), రికెల్టన్‌ (50) అర్ద సెంచరీలు పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు.

ముంబై ఇండియన్స్‌ టార్గెట్‌ ఎంతంటే..?
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రహానే (67), రఘువంశీ (51) అర్ద సెంచరీలతో రాణించగా.. రింకూ సింగ్‌ (33 నాటౌట్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరంభంలో ఫిన్‌ అలెన్‌ (37) సైతం మెరుపులు మెరిపించాడు. 

భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న కెమరూన్‌ గ్రీన్‌ (18) దారుణంగా విఫలం కాగా.. రమన్‌దీప్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ (4-0-39-3), ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-38-0) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా..హార్దిక్‌ పాండ్యా ఓ వికెట్‌ తీశాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
18.3వ ఓవర్‌- 205 పరుగుల వద్ద కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి రఘువంశీ (51) ఔటయ్యాడు. 

రహానే (67) ఔట్‌
13.3వ ఓవర్‌- 146 పరుగుల వద్ద కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో హార్దిక్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానే (67) ఔటయ్యాడు. రఘువంశీ​కి (17) జతగా రింకూ సింగ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌.. గ్రీన్‌ ఔట్‌
8.5 ఓవర్‌- 109 పరుగుల వద్ద కేకేఆర్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రూథర్‌ఫోర్డ్‌కు క్యాచ్‌ ఇచ్చి కెమరూన్‌ గ్రీన్‌ (18) ఔటయ్యాడు. రహానేకు (49) జతగా రఘువంశీ క్రీజ్‌లోకి వచ్చాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
5.2 ఓవర్‌- 69 పరుగుల వద్ద కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి ఫిన్‌ అలెన్‌ (37) ఔటయ్యాడు. రహానేకు (28) జతగా గ్రీన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 29) జరుగుతున్న ఐపీఎల్‌ 2026 రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు..

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్‌కీపర్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, AM ఘజన్‌ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

కేకేఆర్‌: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజారబానీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement