సాల్ట్‌ వివాదాస్పద క్యాచ్‌  | IPL 2026 Controversy Hits After-Salt Take Klaasen Catch Out Or Not-Out | Sakshi
Sakshi News home page

IPL 2026: సాల్ట్‌ వివాదాస్పద క్యాచ్‌

Mar 29 2026 7:12 AM | Updated on Mar 29 2026 8:56 AM

IPL 2026 Controversy Hits After-Salt Take Klaasen Catch Out Or Not-Out

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) బోణీ కొట్టింది. శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బౌలింగ్‌లో జాకబ్‌ డఫీ, రొమారియో షెపర్డ్‌ హడలెత్తించగా, ఆ తర్వాత ఛేదనలో పడిక్కల్‌, పటిదార్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొడితే.. చివరివరకు నిలిచిన మాస్టర్‌ చేజ్‌ కోహ్లీ యాంకర్‌ పాత్ర పోషించాడు. 

అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు ప్లేయర్‌ ఫిల్‌ సాల్ట్‌ తన అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సాల్ట్‌ అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి. ఇన్నింగ్స్‌ 2.4 ఓవర్‌లో హెడ్‌ కొట్టిన బంతిని బౌండరీ సమీపంలో సునాయాసంగా పట్టిన సాల్ట్‌.. క్లాసెన్‌ క్యాచ్‌ను బౌండరీ వద్ద అనూహ్య రీతిలో అందుకున్నప్పటికీ అది వివాదాస్పదంగా మారింది.

షెఫర్డ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తొలి బంతికి క్లాసెన్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ దిశగా భారీ షాట్‌ ఆడగా... అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న సాల్ట్‌ దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బౌండరీ రోప్‌ మీద పడ్డట్లు కనిపించింది. పలుమార్లు పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌ క్లాసెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో క్లాసెన్‌ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. 

థర్డ్‌ అంపైర్‌ మరో కోణం నుంచి పరిశీలించకుండానే నిర్ణయం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాత ఎలాంటి వివాదం లేకుండా 16వ ఓవర్‌ చివరి బంతికి ఇషాన్‌ కొట్టిన భారీ షాట్‌ను సైతం సాల్ట్‌ రెప్పపాటులో అందుకున్నాడు. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ బౌండరీ వద్ద కుడివైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని ఒడిసి పట్టాడు. సూపర్‌ క్యాచ్‌లతో ఆకట్టుకున్న సాల్ట్‌... క్లాసెన్‌ పట్టిన అలాంటి క్యాచ్‌కే పెవిలియన్‌ చేరడం కొసమెరుపు.  

చదవండి: ఆర్‌సీబీ అదరగొట్టింది...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement