IPL 2022- Punjab Kings: సిక్సర్లు ఎలా కొట్టాలంటే... చెబుతా.. నేను ఉన్నది అందుకేగా!

IPL 2022: Punjab Kings Power Hitter Coach Julian Ross Wood Big Plans - Sakshi

కొత్త పుంతలు తొక్కుతున్న ఐపీఎల్‌ బ్యాటింగ్‌ శిక్షణ 

పవర్‌ హిట్టింగ్‌ కోచ్‌ నియామకం 

కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి... ఎన్ని ఫోర్లు బాది ఎంత వేగంగా వికెట్ల మధ్య పరుగెత్తినా టి20 క్రికెట్‌లో సిక్సర్ల మజాయే వేరు. ఇక క్రికెట్‌ వినోదం ఐపీఎల్‌లో అయితే నేరుగా గ్యాలరీల్లోకి పడే సిక్సర్లను మీటర్ల లెక్కన కొలిచి వాటి విలువను నిర్వాహకులు అమాంతం పెంచేస్తుంటారు.

మరి అలాంటప్పుడు సిక్స్‌ కొట్టడం కూడా ఒక ప్రత్యేక కళగా గుర్తించి అందులో శిక్షణ ఇస్తే ఎలా ఉంటుంది. దీనికి ఈ సారి ఐపీఎల్‌లో సమాధానం లభించనుంది. తొలి సారి ఒక జట్టు కేవలం సిక్సర్ల కోసమే కోచ్‌ను పెట్టుకోవడం విశేషం.  
–సాక్షి క్రీడా విభాగం

హెడ్‌ కోచ్, బ్యాటింగ్‌ కోచ్, బౌలింగ్‌ కోచ్, ఫీల్డింగ్‌ కోచ్, మెంటార్, డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌... ఇలా ఐపీఎల్‌ జట్ల ప్రధాన సహాయక సిబ్బంది జాబితా చూస్తే చాలా పెద్దదే. ఇప్పుడు ఇందులోకి మరో పాత్ర కూడా వచ్చి చేరింది. అదే పవర్‌ హిట్టింగ్‌ కోచ్‌.

ఈ తరహా శిక్షణలో పేరుపొందిన ఇంగ్లండ్‌ మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ జూలియన్‌ రాస్‌వుడ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ 2022 లీగ్‌ సీజన్‌ కోసం ఎంచుకుంది. తమ టీమ్‌లో ఉన్న మయాంక్, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, ఒడెన్‌ స్మిత్, షారుఖ్‌ ఖాన్‌ వంటి హిట్టర్ల ఆటకు మరింత మెరుగులు దిద్ది ఫలితం రాబట్టాలని జట్టు ఆశిస్తోంది.  

ఏమిటీ భిన్నం...
గతంలో బిగ్‌బాష్‌ లీగ్, కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్, ఇంగ్లండ్‌ కౌంటీల్లో పని చేసిన జూలియన్‌ రాస్‌వుడ్‌ ఐపీఎల్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. కార్లోస్‌ బ్రాత్‌వైట్, బెన్‌ స్టోక్స్, స్యామ్‌ బిల్లింగ్స్‌ తమ సిక్సర్లు బాదే నైపుణ్యం పెంచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. బౌలర్‌ గొప్పతనం, మంచి బంతా కాదా అనేది ఏమాత్రం పట్టించుకోరాదని, బలమంతా ఉపయోగించి బంతిని బాదడమే ఏకైక మంత్రమని అతను ఉపదేశిస్తాడు.

‘క్రీజ్‌లో బ్యాటర్‌ నిలబడిన తీరును బట్టి అతను ఎంత శక్తిని వాడగలడో తెలుస్తుంది. సంప్రదాయ శైలి షాట్లు ఆడే శరీరం, చేతుల సమన్వయం అనేది ఇక్కడ కుదరదు. నా దృష్టిలో ఈ రెండు వేర్వేరు. బేస్‌ బాల్‌ తరహాలో ఎడమ కాలు వెనక్కి వెళుతూ తుంటి భాగంపై భారం వేస్తే షాట్‌ కొట్టడం సులువవుతుంది.

వెస్టిండీస్‌ ఆటగాళ్లు సహజంగానే ఇలాంటివి ఆడతారు. ఆ నైపుణ్యం లేనివారిని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దడమే నా పని’ అని జూలియన్‌ వివరించాడు. 2008లో ఐపీఎల్‌ ప్రారంభమైన సమయంలోనే టెక్సాస్‌ రేంజర్‌ బేస్‌బాల్‌ లీగ్‌ చూసిన అతను అదే శైలిని టి20 క్రికెట్‌లోకి తీసుకొచ్చాడు. 

తనదైన శిక్షణ పద్ధతితో...
పవర్‌ హిట్టింగ్‌ శిక్షణకు జూలియన్‌ భిన్నమైన పద్ధతిని అనుసరిస్తాడు. బరువైన బ్యాట్‌లు, బరువైన బంతులతో పాటు ఆటగాళ్లు చేతులు, మోచేతికి బరువైన వస్తువులు అమర్చి షాట్‌లు ఆడేలా ప్రోత్సహిస్తాడు. నడుము చుట్టూ తాళ్లు చుట్టు దానిని ఒక పోల్‌కు కట్టేసి ఇతర శరీర భాగాలను వాడకుండా కేవలం మోచేతి బలంతోనే షాట్లు సాధన చేయించడంలో జూలియన్‌ తన ప్రత్యేకత ప్రదర్శిస్తాడు.

‘బేస్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌లో టెక్నిక్‌ కాస్త భిన్నమే అయినా బంతిని బలంగా బాదడమే మనకు కావాల్సింది. ఫలితం గురించి ఆలోచించకుండా పూర్తి శక్తిని ఉపయోగిస్తే టి20ల్లో అద్భుతాలు జరుగుతాయి’ అని జూలియన్‌ విశ్లేషించాడు. అతని మార్గనిర్దేశనంలో పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లు ఎలాంటి ప్రయోజనం పొందుతారో చూడాలి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2022
May 08, 2022, 22:52 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ (మే 8) ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెన‌ర్ డెవాన్ కాన్వే...
08-05-2022
May 08, 2022, 20:46 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ (మే 8) సన్‌రైజర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 67 పరుగుల...
08-05-2022
08-05-2022
May 08, 2022, 18:49 IST
IPL 2022 SRH Vs RCB: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌...
08-05-2022
May 08, 2022, 18:40 IST
ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును క‌రోనా క‌ల‌క‌లం వెంటాడుతుండ‌గానే మ‌రో షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ...
08-05-2022
May 08, 2022, 17:48 IST
ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్‌పై టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంద‌రూ...
08-05-2022
May 08, 2022, 17:21 IST
IPL 2022 SRH Vs RCB Jagadeesha Suchith Record: ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...
08-05-2022
May 08, 2022, 16:55 IST
మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ ప్ర‌త్యేక వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు...
08-05-2022
May 08, 2022, 16:28 IST
IPL 2022 SRH Vs RCB- Virat Kohli Golden Duck: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ...
08-05-2022
May 08, 2022, 15:08 IST
IPL 2022 SRH Vs RCB- Playing XI: ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు మార్పులతో...
08-05-2022
08-05-2022
May 08, 2022, 14:15 IST
PBKS Vs RR: ఇలాంటి బ్యాటింగ్‌ జట్టుకు భారం.. అయినా అతడు నాల్గో స్థానంలో ఎందుకు?
08-05-2022
May 08, 2022, 13:33 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కరోనా ఆడుకుంటుంది. ఆదివారం(మే 8న) రాత్రి సీఎస్‌కేతో ఢిల్లీ మ్యాచ్‌ ఆడనుంది. అయితే మ్యాచ్‌కు ముందు...
08-05-2022
May 08, 2022, 13:00 IST
కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరుపై అక్తర్‌ వ్యాఖ్యలు
08-05-2022
May 08, 2022, 11:18 IST
వెస్టిండీస్‌ స్టార్‌.. యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌కు గేల్‌ దూరంగా ఉన్న...
08-05-2022
May 08, 2022, 10:41 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ జట్టను వీడాడు. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్‌ స్వదేశానికి వెళ్లాడని.. వచ్చే...
08-05-2022
May 08, 2022, 10:07 IST
ఐపీఎల్-2022 లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌(41 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన విలువేంటో...
08-05-2022
May 08, 2022, 08:16 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా శనివారం కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసింది. మ్యాచ్‌లో కేకేఆర్‌కు...
08-05-2022
May 08, 2022, 07:43 IST
పుణే: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి అగ్ర స్థానానికి దూసుకుపోగా.....
08-05-2022
May 08, 2022, 05:45 IST
ముంబై: సీజన్‌ ఆరంభానికి ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు యశస్వి జైస్వాల్‌ను రూ. 4 కోట్లకు రిటెయిన్‌ చేసుకుంది. ఆడిన...



 

Read also in:
Back to Top