IPL 2022: గొప్ప నాయకుడు.. కెప్టెన్‌గా అతడికి వందకు వంద మార్కులు వేస్తాను!

హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ బ్యాటర్ ప్రశంసలు
IPL 2022- Hardik Pandya- Gujarat Titans: టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపించాడు. సారథిగా హార్దిక్‌కు వందకు వంద మార్కులు వేస్తానని వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. గత ఐపీఎల్ సీజన్‌లో బౌలింగ్ చేయకపోవడం, టీ20 ప్రపంచకప్-2021లో వైఫల్యం.. ఆ తర్వాత ఫిట్‌నెస్ సమస్యలు.
ఇలా వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఇందుకు తోడు ఎన్నో ఏళ్లుగా అనుబంధం పెనవేసుకున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని రిటైన్ చేసుకోకుండా వదిలేసింది. ఈ నేపథ్యంలో క్యాష్ రిచ్‌లీగ్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా జట్టును అగ్రపథాన నిలిపాడు. బ్యాటర్‌గానూ రాణించాడు. అతడి సారథ్యంలో గుజరాత్ పద్నాలుగింట ఏకంగా పది మ్యాచ్‌లు గెలిచి 20 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(PC: IPL)
ఇక ఆడిన 13 ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 413 పరుగులు(అత్యధిక స్కోరు 87 నాటౌట్) సాధించి బ్యాటర్‌గానూ నిరూపించుకుని లీగ్ దశ ముగిసే సరికి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదకొండో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ కైఫ్ స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్ పాండ్యాకు కెప్టెన్‌గా వందకు వంద మార్కులు ఇస్తాను. అతడు గొప్ప నాయకుడు.
బౌలర్లతో సమన్వయం చేసుకుంటూ వారిని ప్రోత్సహిస్తాడు. సాధారణంగా బౌలర్లు కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాంటి సమయంలో కెప్టెన్ వారి పక్కనే నిలబడి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటే ఎంతో ఊరటగా ఉంటుంది. కెప్టెన్‌గా హార్దిక్ తన బౌలర్లకు అలాంటి సౌలభ్యాన్ని ఇచ్చాడు’’ అని కొనియాడాడు. హార్దిక్ నాయకత్వం వల్లే జట్టు ఉన్నత శిఖరాన నిలిచిందని కితాబిచ్చాడు.
ఇక హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం.. వేలంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగిందని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. ఆక్షన్ సమయంలో వాళ్ల ప్లాన్ తికమకపెట్టినప్పటికీ... పక్కా ప్రణాళికలతో దృఢమైన జట్టుగా నిరూపించుకున్నారని తెలిపాడు. కాగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన హార్దిక్ సేన.. తొలి క్వాలిఫైయర్‌లో భాగంగా మంగళవారం(మే 24) రాజస్తాన్ రాయల్స్‌తో ఢీకొట్టనుంది.
చదవండి👉🏾IPL 2022: వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే!
చదవండి👉🏾IPL 2022- SRH: టీమిండియా లీడింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు.. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్‌పై రవిశాస్త్రి ప్రశంసలు
Back at a venue that's seen so many iconic moments over decades 🔥
Catch our Titans talking about this amazing vibe called Eden 😍💙#AavaDe #SeasonOfFirsts #TATAIPL #GTvRR pic.twitter.com/Y1P0jHrJ2B
— Gujarat Titans (@gujarat_titans) May 24, 2022
మీ అభిప్రాయం చెప్పండి
మరిన్ని వార్తలు