ఐపీఎల్-2022 షెడ్యూల్ ఫిక్స్.. ఆ రెండు జట్ల మధ్యే తొలి మ్యాచ్!

IPL 2022 Likely to Begin on April 2 in Chennai says Report: క్రికెట్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్.. ఐపీఎల్-2022కు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే బీసీసీఐ ప్రకటించనున్నట్లు సమాచారం. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే ఐపీఎల్ 15 వ సీజన్ షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్యాచ్ రిచ్ లీగ్ ఏప్రిల్ 2 న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆదే విధంగా తొలి మ్యాచ్ డిఫిండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్నట్లు సమాచారం.
కాగా వచ్చే ఏడాది సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు చేరడంతో ఈ లీగ్ మరింత ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఇప్పటివరకు ప్రతీ సీజన్‌లో 60 మ్యాచ్‌లు జరిగేవి, రెండు కొత్త జట్లు ఆదనంగా చేరడంతో మ్యాచ్‌లు సంఖ్య 74కు పెంచినట్లు నివేదిక పేర్కోంది. ఈ సీజన్ 60 రోజులకు పైగా జరగనున్నట్లు నివేదిక చెబుతోంది. ఇక ఐపీఎల్ ఫైనల్ జూన్4 లేదా జూన్5న జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల చెన్నైలో జరిగిన ‘ది ఛాంపియన్స్ కాల్’ కార్యక్రమంలో పాల్గొన్న బీసీసీఐ సెక్రెటరీ జై షా, వచ్చే సీజన్ భారత్‌లోనే జరగతుందని సృష్టం చేశారు.
సంబంధిత వార్తలు