
భారత అండర్-19 స్పిన్నర్ కౌశల్ తాంబేకు బంపర్ ఆఫర్ తగిలింది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నెట్ బౌలర్‌గా తాంబే ఎంపికయ్యాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గొన్న తాంబేను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయకపోయినా.. ఐపీఎల్‌లో భాగమయ్యే ఛాన్స్‌ను తాంబే కొట్టేశాడు. ఇక అండర్-19 ప్రపంచకప్‌లో తాంబే అద్భుతంగా రాణించాడు. కాగా అతడు సహచర ఆటగాళ్లు యష్ ధుల్, విక్కీ ఓస్ట్వాల్‌ను వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
ఇక తాంబే.. డేవిడ్ వార్నర్, పంత్ వంటి సీనియర్ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకోబోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాటింగ్, అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్, బౌలింగ్ కోచ్ అజిత్ అజిత్ అగార్కర్ వంటి దిగ్గజాల ముందు తన బౌలింగ్ స్కిల్స్‌ను తాంబే ప్రదర్శించనున్నాడు. ఇక మార్చి 26 నుంచి వాంఖడే వేదికగా ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 27న ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది.
చదవండి: IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. విలియమ్సన్ ఇక..!
Training at the DC camp = High intensity 🔥
— Delhi Capitals (@DelhiCapitals) March 17, 2022
Can’t wait to see them ROAR in #IPL2022 🤩💙#YehHaiNayiDilli @TajMahalMumbai pic.twitter.com/67R1r8DVaZ