
క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ మెగా వేలం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆక్షన్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏకంగా 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2022 సీజన్‌తో ఎంట్రీ ఇవ్వనున్న లక్నో, అహ్మదాబాద్ ఇప్పటికే ముగ్గురి చొప్పున ఆటగాళ్లను ఎంచుకున్నాయి.
గోయెంకా గ్రూపు నేతృత్వంలోని లక్నో జట్టు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, రవి బిష్ణోయి, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌ను ఎంపిక చేసుకుంది. ఈ నేపథ్యంలో లక్నో మెంటార్ గౌతం గంభీర్ మాట్లాడుతూ... స్టొయినిస్‌ను సెలక్ట్ చేసుకోవడం వెనుక కారణాలు వెల్లడించాడు. ‘‘బెన్‌స్టోక్స్.... తర్వాత స్టొయినిస్‌ను కంప్లీట్ ప్యాకేజ్‌గా చెప్పవచ్చు. తను బ్యాటింగ్ చేస్తాడు.. బౌలింగ్ చేస్తాడు.. అత్యుత్తమ ఫీల్డర్లలో తనూ ఒకడు. అతడి రాక నిజంగా జట్టుకు అదనపు బలం.
టీ20 ప్రపంచకప్‌లో అతడి ఆటను చూశాం కదా. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా స్టొయినిస్‌కు ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా స్టొయినిస్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. గతంలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన ఈ ఆల్‌రౌండర్... టీ20 ప్రపంచకప్-2021 గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు. కాగా రాహుల్‌కు 17 కోట్లు, స్టోయినిస్‌కి రూ.9.2 కోట్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద పంజాబ్ కింగ్స్ మాజీ స్పిన్నర్, భారత అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ రవి బిష్ణోయ్‌కి 4 కోట్లు చెల్లించేందుకు లక్నో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఇమ్రాన్ తాహిర్ విధ్వంసం.. 5 సిక్స్‌లు,3 ఫోర్లలతో..
.@TeamLucknowIPL have picked their three players 🙌🙌🙌 pic.twitter.com/IgJG5cPshJ
— IndianPremierLeague (@IPL) January 22, 2022