IPL 2022: Delhi Capitals Cancel Travel To Pune After Player Tests Positive, Says Reports - Sakshi
Sakshi News home page

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌.. కీలక ఆటగాడికి కరోనా..!

Apr 18 2022 12:18 PM | Updated on Apr 18 2022 12:45 PM

IPL 2022: Delhi Capitals Cancel Travel To Pune After Player Tests Positive - Sakshi

Photo Courtesy: IPL

Delhi Capitals Key Player Tested Positive For Covid: ఐపీఎల్‌ 2022 సీజన్‌ కీలక దశ మ్యాచ్‌లు జరుగుతున్న తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆర్సీబీతో మ్యాచ్‌ తర్వాత జట్టులోని కీలక ఆటగాడు కరోనా మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కిందట (ఏప్రిల్ 15) జట్టు ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, తాజాగా కీలక ఆటగాడు మహమ్మారి బారిన పడ్డాడని సమాచారం. ఈ వార్త తెలిసి డీసీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


ఈ విషయంపై ఐపీఎల్‌ వర్గాల నుంచి కానీ డీసీ యాజమాన్యం నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఈ వార్త వంద శాతం నిజమేనని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 20న పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడేందుకు డీసీ జట్టు పూణేకు వెళ్లాల్సి ఉంది. అయితే కీలక ఆటగాడు కరోనా బారిన పడటంతోనే ఆ జట్టు ప్రయాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్‌ జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మ్యాచ్‌ జరుగుతుందా.. లేదా.. అన్నది అనుమానంగా మారింది.
చదవండి: ఐపీఎల్‌లో కరోనా కలకలం.. సీజన్‌లో తొలి కేసు నమోదు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement