
Breadcrumb
IPL 2022: మిల్లర్ విధ్వంసం..రషీద్ సంచలనం; గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
Apr 17 2022 7:03 PM | Updated on Apr 17 2022 11:18 PM

Live Updates
IPL 2022: సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ లైవ్ అప్డేట్స్
మిల్లర్ విధ్వంసం.. సీఎస్కేపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. డేవిడ్ మిల్లర్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో స్టాండింగ్ కెప్టెన్ రషీద్ ఖాన్ 21 బంతుల్లో 40 పరుగులు సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒక దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రషీద్ ఖాన్‌తో కలిసి ఆరో వికెట్‌కు 90 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశాడు. చివర్లో రషీద్ ఔటైనప్పటికి మిల్లర్ మిగతాపనిని పూర్తి చేశాడు. సీఎస్కే బౌలర్లలో బ్రావో 3, తీక్షణ 2, ముకేష్ చౌదరీ, జడేజా చెరొక వికెట్ తీశారు.
15 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 108/5
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 69, రషీద్ ఖాన్ 4 పరుగులతో ఆడుతున్నారు.
10 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 58/4
సీఎస్కేతో మ్యాచ్‌లో గుజరాత్ 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డేవిడ్ మిల్లర్ 25, రాహుల్ తెవాటియా 1 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు 11 పరుగులు చేసిన సాహా జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ స్కోరు 10 ఓవర్లలో 58/4గా ఉంది.
టార్గెట్ 170.. 27 పరుగులకే మూడు వికెట్లు
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 27 పరుగులకే మూడు వికెట్లు కష్టాల్లో పడింది. సాహా 8, డేవిడ్ మిల్లర్ 6 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు విజయ్ శంకర్, శుబ్‌మన్ గిల్లు డకౌట్ కాగా.. 12 పరుగులు చేసి అభినవ్ మనోహర్ వెనుదిరిగాడు.
రాణించిన గైక్వాడ్, రాయుడు.. సీఎస్కే 169/5
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సీజన్లో తొలిసారి రాణించిన రుతురాజ్ గైక్వాడ్ 48 బంతుల్లో 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంబటి రాయుడు 31 బంతుల్లో 46 పరుగులు సాధించాడు. చివర్లో జడేజా 12 బంతుల్లో 22 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2. యష్ దయాల్, మహ్మద్ షమీ చెరొక వికెట్ తీశారు.
12 ఓవర్లలో సీఎస్కే 100/2
12 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 57, అంబటి రాయుడు 34 పరుగులతో ఆడుతున్నారు. కాగా గైక్వాడ్ ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
9 ఓవర్లలో సీఎస్కే 59/2
9 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 39, అంబటి రాయుడు 12 పరుగులతో ఆడుతున్నారు.
రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్కే
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు మాత్రమే చేసిన మొయిన్ అలీ అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకముందు రాబిన్ ఊతప్ప షమీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2022లో ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్లో బోణీ చేసిన సీఎస్కే.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న పటిష్టమైన గుజరాత్‌ను ఎదుర్కోనుంది. మరి హార్దిక్ సేనను సీఎస్కే ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Related News By Category
Related News By Tags
-
IPL 2023 Final: గెలిపించిన జడేజా.. ఐపీఎల్16వ సీజన్ విజేత సీఎస్కే
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచింది. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని విధించగా.. సీఎస్కే నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగు...
-
పన్నెండులో తొమ్మిదిసార్లు.. క్వాలిఫయర్-1 విజేత
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్‌కు ఇవాళ్టితో శుభం కార్డు పడనుంది. పది జట్లు పోటీ పడితే ఆఖరికి రెండు జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి. ఆదివారం(మే 28న) గుజరాత్ టైట...
-
IPL 2023 Final: వర్షం కారణంగా మ్యాచ్ సోమవారానికి వాయిదా
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షంతో కన...
-
సీఎస్కే ఐదోసారి కొడుతుందా లేక గుజరాత్ డబుల్ ధమాకానా?
రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 16వ సీజన్‌కు మరొక రోజులో తెరపడనుంది. ఈ సీజన్లో పది జట్లు బరిలోకి దిగితే.. ఆఖరి అంకానికి రెండు జట్లు చేరుకున్నాయి. ఒకటి నాలుగుసార్లు ఛాంపియన్ సీఎస్క...
-
ప్లాన్ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా?
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ వి...