IPL 2022: CSK CEO Reveals Why Suresh Raina Was Not Bought In Mega Auction - Sakshi
Sakshi News home page

IPL 2022: అందుకే రైనాను తీసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే

Feb 14 2022 9:45 PM | Updated on Feb 15 2022 12:29 PM

IPL 2022: CSK CEO Reveals Why Suresh Raina Was Not Bought In Auction - Sakshi

Suresh Raina: బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో కొందరు స్టార్‌ ప్లేయర్స్ అన్‌ సోల్డ్ గా మిగిలిపోయారు. ఐపీఎల్‌ కెరీర్‌లోనే ది బెస్ట్ అనిపించుకున్న వారు సైతం కనీస ధరకు అమ్ముడు పోలేదు. ముఖ్యంగా చెన్నై సూపర్‌ కింగ్స్ స్టార్‌ బ్యాటర్‌ సురేశ్‌ రైనా అన్‌ సోల్డ్‌గా మిగిలిపోవడం క్రికెట్‌ ఫ్యాన్స్‌ ను, తమిళ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. 


అయితే, వేలంలో రైనాను తీసుకోకపోవడంపై చైన్నై ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ‍్వనాథ్‌ సోమవారం స్పందించారు. ఆయన మాట్లాడుతూ..' సురేశ్‌ రైనా పన్నెండేళ్లుగా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ, ప్రతీ ఆటగాడిని ఫామ్‌ ఆధారంగానే జట్టులోకి తీసుకోవడం జరుగుతుంది. అతన్ని కొనుగోలు చేయడం మాకు చాలా కష్టమైన విషయమని అర్థం చేసుకోవాలన్నారు. మా టీంకు అతను ఫిట్ కాదని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. రైనాను మిస్​ అవుతున్నామని తెలిపారు. మరోవైపు.. ఐపీఎల్‌లో తమ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రైనా సేవలకు చెన్నై సూపర్​కింగ్స్ ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపింది. 
చదవండి: IPL 2022: ధోని జట్టుపై గరం అవుతున్న సొంత అభిమానులు.. కారణం ఇదేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement