IPL 2021 CSK Vs KKR: అందుకే బ్రావో ఈరోజు ఆడటం లేదు: ధోని

IPL 2021 CSK Vs KKR: Why DJ Bravo Not Playing Today Match - Sakshi

Why is DJ Bravo not playing today's CSK vs KKR match: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్‌ ప్లేయర్‌ డ్వేన్‌ బ్రావో లేకుండానే చెన్నై సూపర్‌కింగ్స్‌ మైదానంలో దిగింది. అబుదాబిలోని షేక్‌ జాయేద్‌ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో పిచ్‌ కాస్త స్లోగా ఉంటుందన్న విశ్లేషణల నేపథ్యంలో ధోని సేన ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా స్లో పిచ్‌లపై బ్రావో మెరుగ్గా ఆడతాడన్న సంగతి తెలిసిందే. ఇక గత రెండు మ్యాచ్‌లలోనూ విండీస్‌ ఆల్‌రౌండర్‌ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన రెండో ఫేజ్‌ పునః ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై విజయంలో బ్రావో తన వంతు పాత్ర పోషించాడు. 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. అదే విధంగా శుక్రవారం నాటి ఆర్సీబీ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. విరాట్‌ కోహ్లి, మాక్స్‌వెల్‌, హర్షల్‌ పటేల్‌ వికెట్లు తన ఖాతాలో వేసుకుని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో విజయంతో చెన్నై ప్లే ఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకుంది. 

ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో బ్రావోకు విశ్రాంతినివ్వాలని ధోని భావించడం గమనార్హం. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ధోని ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘అవును.. అతడు ఆడటం లేదు. తనకు రెస్ట్‌ అవసరం. సీపీఎల్‌లో భాగంగా బ్రావో గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ గాయం తాలూకు ప్రభావం ఉండే అవకాశం ఉంది. 48 గంటల లోపే(శుక్రవారం ఆర్సీబీతో, ఆదివారం కేకేఆర్‌తో) మరో మ్యాచ్‌ అంటే కష్టం. గాయం తిరగబెట్టే అవకాశం ఉంటుంది’’ అని, అందుకే నేటి మ్యాచ్‌లో బ్రావో ఆడటం లేదని చెప్పుకొచ్చాడు.

కాగా ఇటీవల ముగిసిన కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడే సమయంలో డ్వేన్‌ బ్రావో గాయపడ్డాడు. ఈ క్రమంలో కోలుకున్న అతడు.. ఐపీఎల్‌ రెండో అంచెకు అందుబాటులోకి వచ్చాడు. ఫేజ్‌ 2 తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబైతో జరిగిన పోరులో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. 3 వికెట్లు తీయడం సహా... 8 బంతుల్లో 23 పరుగులు చేసి సత్తా చాటాడు.

చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

26-09-2021
Sep 26, 2021, 18:35 IST
డుప్లెసిస్‌ అవుట్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓపెనర్‌ డుప్లెసిస్‌కు అర్ధ సెంచరీ చేసే అవకాశం మిస్సయింది. 30 బంతుల్లో 43 పరుగులు చేసిన అతడు.. ప్రసిద్‌...
26-09-2021
Sep 26, 2021, 16:56 IST
Faf Du Plessis Takes A Brillint Catch: అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు...
26-09-2021
Sep 26, 2021, 13:26 IST
SRH: మిడిలార్డర్‌ ‘జాతి రత్నాలు’ వీళ్లు.. ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ మామూలుగా లేవు!
26-09-2021
Sep 26, 2021, 11:50 IST
Jagadeesha Suchith Stunning Catch: ఐపీఎల్ 2021లో వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  ప్లేఆప్‌ రేసు...
26-09-2021
Sep 26, 2021, 10:06 IST
అబుదాబి: స్లో ఓవర్‌రేట్‌ కారణంగా రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌కు మరోసారి భారీ జరిమానా పడింది. ఢిల్లీతో జరిగిన...
26-09-2021
Sep 26, 2021, 04:17 IST
అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీ తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జోరు కనబరుస్తోంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో...
26-09-2021
Sep 26, 2021, 04:10 IST
ఐపీఎల్‌ సీజన్‌లో మీది చెత్త జట్టా...లేక మాదా! శనివారం ఒకదశలో పంజాబ్‌ కింగ్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆట చూస్తే ఇరు...
25-09-2021
Sep 25, 2021, 23:15 IST
ఉత్కంఠ పోరులో పంజాబ్‌దే విజయం 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన  ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ...
25-09-2021
Sep 25, 2021, 22:22 IST
Delhi Capitals Spinner Ashwin Bags 250th T20 Wicket: పొట్టి క్రికెట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌...
25-09-2021
Sep 25, 2021, 21:32 IST
Sanju Samson Comments Lost Match To Delhi Capitals.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన...
25-09-2021
Sep 25, 2021, 20:32 IST
అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది....
25-09-2021
Sep 25, 2021, 19:23 IST
ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో...
25-09-2021
Sep 25, 2021, 19:23 IST
అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలైంది. 155 పరుగుల...
25-09-2021
Sep 25, 2021, 18:42 IST
No Boundary For Rajastan Royals In Power Play.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో...
25-09-2021
Sep 25, 2021, 17:55 IST
Releasing Suryakumar Yadav Was KKRs Biggest Loss: తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం చేసిన...
25-09-2021
Sep 25, 2021, 17:06 IST
అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది....
25-09-2021
Sep 25, 2021, 16:26 IST
Mark Butcher Comments On Wriddhiman Saha:  ఐపీఎల్‌ 2021 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస అపజయాలతో పాయింట్ల పట్టికలో...
25-09-2021
Sep 25, 2021, 16:21 IST
RCB New Captain After Virat Kohli.. ఐపీఎల్‌ 2021 తర్వాత విరాట్‌ కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీ పదవి నుంచి...
25-09-2021
Sep 25, 2021, 15:45 IST
Virat Kohli Six Out Of Stadium.. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అర్థ సెంచరీతో...
25-09-2021
Sep 25, 2021, 14:49 IST
ధోని టీమిండియాకు మెంటార్‌గా ఎంపికయ్యాడని తెలిసినప్పటి నుంచి కోహ్లి సంతోషంలో మునిగిపోయాడు.. అందుకే 

Read also in:
Back to Top