MI Vs DC: 4 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు.. ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం

IPL 2021 2nd Phase Mumbai Indians Vs Delhi Capitals Match Live Updates And Highlights - Sakshi

 4 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు.. ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం
130 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతూ బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో అశ్విన్‌ సిక్సర్‌ బాది ఢిల్లీని గెలిపించాడు. శ్రేయస్‌ అయ్యర్‌(33 బంతుల్లో 33; 2 ఫోర్లు), అశ్విన్‌(21 బంతుల్లో 20; సిక్స్‌) బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.19.1 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బౌలర్లు బౌల్ట్‌, జయంత్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా, బుమ్రా, కౌల్టర్‌ నైల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పరాజయంతో ముంబై ప్లే ఆఫ్‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. 

హెట్‌మైర్‌(15) ఔట్‌.. ఢిల్లీ 93/6
బుమ్రా వేసిన 13.1వ ఓవర్లో 93 పరుగుల స్కోర్‌ వద్ద రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి హెట్‌మైర్‌(8 బంతుల్లో 15; ఫోర్లు) ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(16), అశ్విన్‌ ఉన్నారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ..అక్షర్‌(9) ఔట్‌
బౌల్డ్‌ వేసిన 12వ ఓవర్‌లో అక్షర్‌(9 బంతుల్లో 9; ఫోర్‌) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. 11.4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్‌ 77/5. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, హెట్‌మైర్‌ ఉన్నారు. 

పంత్‌(26) ఔట్‌.. ఢిల్లీ 57/4
ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ రెండో బంతికి జయంత్‌ యాదవ్‌ బౌలింగ్‌లో హార్ధిక్‌ పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌(22 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్‌) వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌(7), అక్షర్‌ పటేల్‌ ఉన్నారు. 

30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
స్వల్ప లక్ష్యాన్ని ఛేదనలో ఢిల్లీ జట్టు తడబడుతుంది. 15 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 30 పరుగుల స్కోర్‌ వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది.  కౌల్టర్‌ నైల్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌(8 బంతుల్లో 9; సిక్స్‌) క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. క్రీజ్‌లో పంత్‌(7), శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు. 

ఢిల్లీకి బిగ్‌ షాక్‌.. పరుగు తేడాతో 2 వికెట్లు డౌన్‌
130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. పరుగు తేడాతో ఆ జట్టు ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. 2వ ఓవర్‌ ఆఖరి బంతికి పొలార్డ్‌ సూపర్‌ త్రోతో ధవన్‌(7 బంతుల్లో 8; సిక్స్‌)ను రనౌట్‌ చేయగా.. ఆ మరుసటి ఓవర్‌లోనే(2.4 ఓవర్‌) కృనాల్‌ బౌలింగ్‌లో పృథ్వీ షా(7 బంతుల్లో 6; ఫోర్‌) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 2.4 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 15/2. క్రీజ్‌లో స్టీవ్‌ స్మిత్‌(1), పంత్‌ ఉన్నారు. 

ముంబై పేలవ ప్రదర్శన.. ఢిల్లీ టార్గెట్‌ 130
అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో ముంబై జట్టు జయంత్‌ యాదవ్‌(4 బంతుల్లో 11; ఫోర్‌, సిక్స్‌) వికెట్‌ను కోల్పోయి 13 పరుగులు సాధించడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 129 పరుగుల నామమాత్రపు స్కోర్‌ను చేయగలిగింది. ఆఖరి బంతికి కృనాల్‌(15బంతుల్లో 13 నాటౌట్‌; ఫోర్‌, సిక్స్‌) సిక్సర్‌ బాదడంతో ముంబై ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌, నోర్జేలకు తలో వికెట్‌ దక్కింది. 

ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ముంబై 116/7
ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ముంబై రెండు వికెట్లు కోల్పోయింది. ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఈ ఓవర్‌ తొలి బంతికి హార్ధిక్‌ పాండ్యా(18 బంతుల్లో 17; 2 ఫోర్లు) వెనుదిరగగా, 18.4 బంతికి కౌల్టర్‌ నైల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 19 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 116/7. క్రీజ్‌లో కృనాల్‌(7), జయంత్‌ యాదవ్‌(5) ఉన్నారు. 

ముంబైకు బిగ్‌ షాక్‌..పొలార్డ్‌(6) ఔట్‌
నోర్జే వేసిన 15వ ఓవర్‌లో ముంబై జట్టుకు మరో షాక్‌ తగిలింది. హార్డ్‌ హిట్టర్‌ పొలార్డ్(9 బంతుల్లో 6) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 14.1 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 87/5.క్రీజ్‌లో హార్ధిక్‌ పాండ్యా(2), కృనాల్‌ ఉన్నారు. 

అక్షర్‌ మాయాజాలం.. సౌరభ్‌ తివారీ(15) ఔట్‌, ముంబై 80/4
ఢిల్లీ బౌలర్‌ అక్షర్‌ పటేల్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ముంబై జట్టును దారుణంగా కొట్టాడు. 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తొలుత డికాక్‌, సూర్యకుమార్‌ వికెట్లు పడగొట్టిన అతను.. 13వ ఓవర్‌లో సౌరభ్‌ తివారీ(18 బంతుల్లో 15; ఫోర్‌)ని సైతం వెనక్కు పంపాడు. పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి సౌరభ్‌ తివారీ అవుటయ్యాడు. 12.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 80/4. క్రీజ్‌లో పొలార్డ్‌(3), హార్ధిక్‌ పాండ్యా ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ముంబై.. సూర్యకుమార్‌ యాదవ్‌(33) ఔట్‌
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌(26బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)కు ఎట్టకేలకు శుభారంభం లభించినప్పటికీ భారీ స్కోర్‌గా మలచుకోవడంలో విఫలమయ్యాడు. అక్షర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10.3 ఓవర్‌లో​ రబాడకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై 68 పరుగల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్‌లో సౌరభ్‌ తివారీ(8), పొలార్డ్‌ ఉన్నారు.  

ముంబై రెండో వికెట్‌ డౌన్‌.. డికాక్‌(19) ఔట్‌
ఇన్నింగ్స్‌ 7వ ఓవర్‌లో ముంబైకు మరో షాక్‌ తగిలింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో నోర్జే క్యాచ్‌ పట్టడంతో డికాక్‌(18 బంతుల్లో 19; ఫోర్‌, సిక్స్‌) వెనుదిరిగాడు.  6.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 37/2. క్రీజ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌(10), సౌరభ్‌ తివారీ ఉన్నారు. 

నిరాశపరిచిన రోహిత్‌(7).. ముంబై తొలి వికెట్‌ డౌన్‌
ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(10 బంతుల్లో 7; ఫోర్‌) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు 2వ ఓవర్‌లోనే గట్టి షాక్‌ తగిలింది. ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రబాడకు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ వెనుదిరిగాడు.1.5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 8/1. క్రీజ్‌లో డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నారు. 

షార్జా: ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానున్న డబుల్‌ హెడర్‌ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇరు జట్లు 29 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా ముంబై 16 సార్లు నెగ్గగా.. ఢిల్లీ 13 విజయాలు సాధించింది. ప్రస్తుత సీజన్‌ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో పంత్ సేననే విజయం వరించింది. ఇక ఇరు జట్ల పాయింట్ల విషయానికొస్తే.. ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో రెండో స్థానంలో ఉండగా, ముంబై 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. 

తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), క్వింటన్ డికాక్(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైల్, జయంత్‌ యాదవ్‌, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా,  స్టీవ్‌ స్మిత్‌, శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, కీపర్), షిమ్రోన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్, అవేష్ ఖాన్.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top