Ind Vs WI 3rd ODI: Predicted Playing XI Against WI And Pitch Report - Sakshi
Sakshi News home page

Ind Vs Wi 3rd ODI: సీమర్లు, స్పిన్నర్లకు చక్కని అవకాశం.. కుల్దీప్‌ తుదిజట్టులోకి?

Feb 11 2022 10:20 AM | Updated on Feb 11 2022 11:39 AM

India Vs West Indies 3rd ODI Ahmedabad: Predicted Playing XI Pitch Report - Sakshi

Ind Vs Wi 3rd ODI: సీమర్లు, స్పిన్నర్లకు చక్కని అవకాశం..  కుల్దీప్‌ తుదిజట్టులోకి?

Ind Vs Wi 3rd ODI: వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో వెస్టిండీస్‌తో నామమాత్రపు మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. అహ్మదాబాద్‌ వేదికగా మూడో వన్డేలోనూ విజయం సాధించి వైట్‌వాష్‌తో విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని భావిస్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఇప్పటికే రెండింట గెలిచిన రోహిత్‌ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇటు బ్యాటర్లు.. అటు బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం అంత కష్టమేమీ కాకపోవచ్చు. మరోవైపు ఒత్తిడిలో కూరుకుపోయిన విండీస్‌ ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, కోహ్లి, రాహుల్, పంత్, దీపక్‌ హుడా / సూర్యకుమార్, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్, సిరాజ్, చహల్‌ / కుల్దీప్, ప్రసిధ్‌ కృష్ణ.
వెస్టిండీస్‌: పొలార్డ్‌ (కెప్టెన్‌), షై హోప్, బ్రండన్‌ కింగ్, డారెన్‌ బ్రేవో, బ్రూక్స్, పూరన్, హోల్డర్, ఫ్యాబియన్‌ అలెన్, హోసీన్, జోసెఫ్, రోచ్‌.

పిచ్, వాతావరణం
గత మ్యాచ్‌లాగే బౌలర్లకు అనుకూలించవచ్చు. ఇది సీమర్లు, స్పిన్నర్లకు చక్కని అవకాశం. వాతావరణంతో ఇబ్బంది లేదు. చలి  తగ్గడంతో మంచు ప్రభావం ఉండదు.

చదవండి: Under 19 Vice Captain Shaik Rasheed: సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement